మహేష్ సంక్రాంతి బరిలో ఎన్నిసార్లు సక్సెస్ సాధించాడో తెలుసా.. ఇన్ని హిట్లు ఉన్నాయా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) తాజాగా నటించిన గుంటూరు కారం సినిమా రేపు అనగా జనవరి 12న విడుదల కానున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు వస్తున్న టాక్ ని బట్టి చూస్తే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం అని తెలుస్తోంది.అయితే కేవలం ఈ సంక్రాంతికి మాత్రమే కాకుండా మహేష్ బాబు గతంలో ఎన్నో సంక్రాంతి పండుగలకు సినిమాలను విడుదల చేసి బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.

మరి ఇప్పటి వరకు సంక్రాతికి బాక్సాఫీస్ వద్ద ఎన్ని సార్లు హిట్టు కొట్టాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం.టక్కరి దొంగ( takkari donga ).మహేష్ బాబు కౌబాయ్ గెటప్ లో కనిపించిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ టక్కరి దొంగ.2002లో విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా ఫ్లాప్ గా నిలిచింది.

Guntur Kaaram Hero Mahesh Babu Films Released In Sankranti Total List, Guntur Ka

ఒక్కడు( okkadu ).2003లో ఒక్కడు సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచాడు మహేష్ బాబు.ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు.

Advertisement
Guntur Kaaram Hero Mahesh Babu Films Released In Sankranti Total List, Guntur Ka

ఈ సినిమా మహేష్ బాబు కెరియర్ లోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఒక మెయిల్ స్టోన్ గా నిలిచిపోయింది.

Guntur Kaaram Hero Mahesh Babu Films Released In Sankranti Total List, Guntur Ka

బిజినెస్‌మెన్( Businessman ).ఒక్కడు సినిమా తర్వాత మహేష్ బాబు ఆ తర్వాత మళ్లీ 9 ఏళ్లకు సంక్రాంతికి బరిలోకి దిగాడు.2012లో బిజినెస్ మ్యాన్ తో బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు( Seethamma Vakitlo Sirimalle Chettu ).ఆ తర్వాత 2013లో మల్టీస్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో సూపర్ హిట్ అటాక్ ని అందుకున్నారు మహేష్ బాబు.

Guntur Kaaram Hero Mahesh Babu Films Released In Sankranti Total List, Guntur Ka

2002 లో టక్కరి దొంగతరువాత మహేష్ బాబుకి సంక్రాంతి బరిలో మరోసారి దెబ్బ తగిలిందంటే, అది 2014లో 1 నేనొక్కడినే మూవీతోనే.భారీ అంచనాలతో రిలీజైన్ ఈ చిత్రం ప్లాప్ టాక్ ని తెచ్చుకుంది.సరిలేరు నీకెవ్వరూ( Sarileru Neekevvaru ).2020లో సంక్రాంతి పండుగ కానుకగా వచ్చిన సరిలేరు నీకెవ్వరూ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.

ఈ విధంగా మహేష్ బాబు తన కెరీర్ లో మొత్తం ఆరుసార్లు సంక్రాంతి బరిలో పోటీ చేయగా, రెండు సార్లు ప్లాప్స్ ని అందుకుంటే నాలుగు సార్లు బ్లాక్ బస్టర్స్ ని అందుకున్నారు.ఇక ఈసారి గుంటూరు కారంతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

మరి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ను అందుకుంటారో చూడాలి మరి.

Advertisement

తాజా వార్తలు