వైసీపీ కి, మంత్రి పదవికి గుమ్మనూరు జయరాం రాజీనామా ..

విజయవాడ: వైసీపీ కి, మంత్రి పదవికి గుమ్మనూరు జయరాం రాజీనామా చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

12 ఏళ్ల నుంచి వైసీపీ జెండా మోశానన్నారు.రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నానని.

మంత్రి పదవి చేశానన్నారు.ఆలూరు ప్రజల మనోభావాలకు అనుగుణంగా వైసీపీని వీడుతున్నానన్నారు.

చంద్రబాబు సమక్షంలో జయహో బీసీ సదస్సులో టీడీపీ లో చేరుతున్నానని గుమ్మనూరి ప్రకటించారు.ఆలూరు నియోజకవర్గంలోనే ఉండాలని కోరుకున్నానని.

Advertisement

ఎంపీ పదవి వద్దన్నానని తెలిపారు.మా నియోజకవర్గం ప్రజలు కూడా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నారని గుమ్మనూరు అన్నారు.

మా కులం ఎక్కువగా రెండు జిల్లాల్లోనే ఉందని తెలిపారు.గుంతకల్ నుంచి పోటీ చేయడానికి తాను సుముఖంగా ఉన్నానన్నారు.

తన సొంతూరు గుంతకల్ దగ్గర్లోనే ఉంది.కాబట్టి తాను గుంతకల్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నానన్నారు.

కర్ణాటకలో తన సోదరుడు మంత్రిగా ఉన్నారని.తానేమీ కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో లేనని తెలిపారు.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

‘‘సీఎం జగన్ నా.నా.అంటున్నారు.కానీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో బీసీలకు న్యాయం జరగలేదన్నారు.

Advertisement

ఓ బోయను.ఓ ఎస్సీ.ఓ ముస్లింలను తీసేశారు.2022 తర్వాత జగన్ను ఓ దేవుడిగానే చూశాను.2022.తర్వాత జగన్ విగ్రహంగా మారారు.

ఆ విగ్రహానికి సజ్జల, ధనుంజయ్ రెడ్డిలు పూజారులు.పూజారులు వాళ్ల కొడుకులకే న్యాయం చేస్తున్నారు కానీ.

భక్తులకు న్యాయం చేయడం లేదు’’ అని గుమ్మనూరి జయరాం పేర్కొన్నారు.

తాజా వార్తలు