GST is Rahul gandhi 2019 election strategy

ప్రతీమనిషికి అదృష్టం ఒక్కసారి వస్తుంది.అప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటారు.

నిజమే రాహుల్ విషయంలో ఇది నిజం అవ్వనుంది అంటున్నారు విశ్లేషకులు.

బిజేపి అధికారం లోకి రావడం మోడీ ప్రధానమంత్రి అవ్వడం.

ప్రపంచ పర్యటన చేస్తూ భారత్ పేరు ప్రపంచంలో అందరికీ తెలిసేలా చేసి పెట్టుబడులకి ఊపు తీసుకువచ్చిన ఒకే ఒక వ్యక్తీ మోడీ.ఒక్క సారిగా తానూ సంపాదించిన ఘన కీర్తి ఒక్కసారిగా నోట్ల రద్దు, GST వాళ్ళ పటాపంచలు అయ్యింది.

అంతేకాదు మోడీ సర్కార్ కాంగ్రెస్ గెలుపుకి GST బాట వేసింది అని కూడా అంటున్నారు విశ్లేషకులు.రాహుల్ ఈ మధ్య మోడీని బాగానే టార్గెట్ చేస్తున్నారు.

Advertisement

మనం “డీ” ఒక వ్యక్తితో తలపడాలి అంటే అందుకు తగ్గట్టుగా రాటుదేలాలి ఇప్పుడు రాహుల్ అదే చేస్తున్నారు.ఇదే విషయాన్ని ఆయన కూడా గుర్తించినట్లున్నారు.

అందుకే ఇటీవల కాలంలో ఆయనకు కంటెంట్ రాసే వ్యక్తి.ఆయనకు సూచనలు చేసే మెంటార్ మారినట్లుగా కనిపిస్తోంది.

రాహుల్ మాటల్లో కానీ చేతల్లో కాని.హావభావాలు పలికించడంలో చాలా మార్పు చోటుచేసుకుంది.

మొన్నటివరకు రాహల్ చేసే వ్యాఖ్యల్లో పదును ఉండేది కాదు ఇప్పుడు రాహుల్ చాలా చురుకుగా మాట్లాడుతున్నారు.మోడీ అండ్ బ్యాచ్ కి దిమ్మతిరిగే షాక్స్ ఇస్తున్నారు రాహుల్.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
God Of Coins Player Safety And Responsible Gambling (UK)

ఇటీవల కాలంలో జీఎస్టీ పన్నుపై మోడీ సర్కారుపై వచ్చిన వ్యతిరేకత తెలిసిందే.ఇప్పుడు రాహుల్ కి ఇదే బ్రహ్మాస్త్రం.

Advertisement

దీన్ని తెలివిగా తనకు అనుకూలంగా మార్చుకోవటంతోపాటు.జీఎస్టీలో మార్పులు చేయాలి అనేట్టుగా రాహుల్ కొత్త రాగం అందుకుంటున్నారు.

అందులో భాగంగా.తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు.2019 లో కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చిన GST పన్ను సేవల విషయంలో సమూలమైన మార్పులు తీసుకువస్తాం అని తెలిపారు.ముఖ్యంగా ప్రజలు వ్యాపారులకి ఊరటకలిగేలా మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు.

GST వల్ల దేశవ్యాప్తంగా ఎంతో మంది వ్యాపారులు మోడీ ప్రభుత్వం మీద వ్యతిరేకత తెచ్చుకున్నారు.అంతేకాదు ఈ సారి మోడీకి ఓటు వేసేది లేదని చెప్పేస్తున్నారు కూడా ఇలాంటి సమయంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ కి కలిసొచ్చే అంశం అని ప్రజలు కూడా కాంగ్రెస్ కి మద్దతు పలికే అవకాశం ఉంది అంటున్నారు.

కేంద్ర సర్కారు ముందు చూపు లేకుండా నోట్ల రద్దు ,జీఎస్టీని అమల్లోకి తెచ్చారని బిజెపి తన గొయ్యి తానె తవ్వుకుందని అంచనాలు వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.