ఫిర్యాదులు వేగవంతంగా పరిష్కరించబడాలి:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఫిర్యాదులు వేగవంతంగా పరిష్కరింప చేయడంలో రిసెప్షన్ అధికారులు చురుకుగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన అన్నారు.

పెండింగ్ లో ఉన్న ఫిర్యాదుల ప్రాధాన్యతను సంబంధిత ఎస్ఎచ్ఓ ల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు.

జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం రోజున జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు చెందిన రిసెప్షన్ అధికారులకు శిక్షణ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కు వచ్చే పిటీషనర్ల సమస్యలను ఓపికతో విని వారికి తగు న్యాయం లభింస్తుందన్న నమ్మకాన్ని కలిగించడంలో రిసెప్షన్ అధికారుల పాత్ర కీలకం అన్నారు.

పోలీస్ స్టేషన్లకు వచ్చే అన్ని వర్గాల ప్రజలు సంతృప్తి చెందేలా సేవలందించాలన్నారు.ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన రెండు రకాల ధృవీకరణలతో వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని చెప్పారు.

ఫిర్యాదుల పరిష్కారం వివరాలను పై స్థాయి అధికారులు పరిశీలిస్తున్నారనే విషయాన్ని గుర్తించాలన్నారు.ఫిర్యాదులు అందిన వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

Advertisement

సమర్థవంతమైన సేవలందించే వివిధ విభాగాలకు చెందిన అధికారులకు ప్రతి నెలా రివార్డులను అందజేయడం జరుగుతుందని తెలిపారు.ఫిర్యాదుల పరిష్కారం పైనే పోలీస్ స్టేషన్ల పనితీరు ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సి.ఐ అనిల్ కుమార్,రిసెప్షన్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు