భలే ఐడియా.. ఏకంగా గాడిదతోనే సెల్ ఫోన్ ఛార్జింగ్..!

గాడిద అంటే అందరికి ఎక్కువగా గుర్తుకు వచ్చేది తిట్లు.ఇక గాడిదతో చాలా పని చేయించుకుంటారు.

అంతేకాకుండా వాటిని జాగ్రత్తగా కూడా చూసుకుంటారు గాడిదలు కాసే వారు.చాలామంది అనుకుంటారు.

గాడిదలు కాసే వారికి కూడా స్మార్ట్ ఆలోచనలు వస్తాయా అని, కానీ ఈ యువకుడి ఆలోచనికి ఇప్పుడు అందరూ ఫిదా అయిపోతున్నారు.ఏం ఐడియా గురూ.

అంటూ మెచ్చుకుంటున్నారు.ఇంతకీ ఆ కుర్రాడు ఏం చేశాడు అనుకుంటున్నారా.? అయితే మీరే చదవండి.నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్‌కు చెందిన హుస్సేనప్ప అనే యువకుడు గాడిదలను కాస్తుంటాడు.

Advertisement

ఇక ఎప్పుడూ గాడిదలను మేతకు తీసుకెళ్లడం చేశావాడు.ఈ క్రమంలో ఆయన చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

వచ్చే సరికి రాత్రి కావడం, సెల్‌ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోవడంతో చాలా ఇబ్బందిగా ఫీలయ్యేవాడు.ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనాలని నిర్ణయించుకున్నాడు.

ఒక రోజు అడవిలో గాడిదను మేపుతున్న క్రమంలో అతనికి ఓ ఆలోచన తట్టింది.అదే సోలర్ లైటింగ్.

గాడిద పై సోలార్ ప్లేట్స్ పెట్టి ఓ బ్యాటరీని వెంట తీసుకెళ్తే దాని ద్వారా ఛార్జింగ్ పొందవచ్చని, అలాగే లైటింగ్ కూడా వస్తుందని అనుకున్నాడు.

పైసా ఖర్చు లేకుండా ముఖంపై మచ్చలను పోగొట్టుకోవాలనుకుంటే ఇలా చేయండి!

అనుకున్నట్లుగానే, జడ్చర్లలో సోలార్ ప్లేట్‌తో పాటు బ్యాటరీలు కొనుగోలు చేసి, గాడిద వీపు పై ఉంచాడు.గాడిద పై సోలర్ ప్లేట్ పెట్టుకొని వెళ్తుంటే.అది చూసిన కొందరు ఆశ్చర్యానికి గురయ్యారు.

Advertisement

వావ్.వాట్ ఏ ఐడియా అంటూ ప్రశంసించడం మొదలు పెట్టారు.

ఇక మరికొంత మంది అయితే సెలబ్రిటీలా గాడిదను ఫొటోస్ తీయడం స్టార్ట్ చేశారు.కొందరు ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్‌గా మారింది.

ఇక దీన్ని చూసిన వారందరూ.హుస్సేన్‌ను పొగుడుతున్నారు.

చేసే పని ఎలాంటిదైనా, తమకు అనుకూలంగా మార్చుకోవడం గొప్ప అని, మరికొందరు గాడిదలు కాసే అతనికి ఇంతటి హైటెక్ ఐడియానా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక మరెందుకు లేటు మీరు చూసి కామెంట్ చేయండి.