తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై ప్రభుత్వం దూకుడు..!!

తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై కాంగ్రెస్( Congress ) ప్రభుత్వం దూకుడు పెంచింది.

ఈ మేరకు చిత్రకారుడు రుద్ర రాజేశంతో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) చర్చించారు.

ఇందులో భాగంగా పలు నమూనాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.తరువాత అధికారిక చిహ్నం తుది నమూనాపై ఆయన పలు కీలక సూచనలు చేశారని తెలుస్తోంది.

అయితే ఇప్పటికే తెలంగాణ కోడ్ టీఎస్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం టీజీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.రాష్ట్ర సర్కార్ ఉత్తర్వుల మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ఏజెన్సీలు మరియు ఇతర అధికారిక కమ్యూనికేషన్లు సైతం తెలంగాణ కోడ్ ను టీఎస్ బదులుగా టీజీని వాడుతున్నారు.

ఈ క్రమంలోనే రాష్ట్ర అధికారిక చిహ్నం ను మార్చేందుకు సర్కార్ తీవ్ర కసరత్తు చేస్తోంది.

Advertisement
హే ప్రభూ.. ఏంటి ఈ విడ్డురం.. బస్సు అనుకుంటే పొరపాటే సుమీ..

తాజా వార్తలు