గవర్నర్ ప్రసంగం అభ్యంతరకరం ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు..!!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి.చాలా రోజుల తర్వాత ఉభయసభలు వాడి వేడిగా జరిగాయి.

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ మధ్య వాదోపవాదాలు గట్టిగా జరిగాయి.శాసనమండలిలో కూడా సీఎం రేవంత్ రెడ్డి.

ఎమ్మెల్సీ కవిత మధ్య చర్చ జరిగింది.ఇదిలా ఉంటే గవర్నర్ తమిళ్ సై ప్రసంగం పట్ల ప్రజలంతా బాధపడ్డారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (( MLC Kavitha )వ్యాఖ్యానించారు.

రెండుసార్లు ప్రజలు గెలిపించిన ప్రభుత్వాన్ని గవర్నర్ అవమానించారు.ఇది నిరంకుశ ప్రభుత్వమని ఆరోపించారు.

Advertisement

గవర్నర్ ప్రసంగంలోని అంశాలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నారు.ప్రజలంతా బాధపడ్డారని ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించాలని కోరినట్లు ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.

ఇదే సమయంలో మండలిలో నూతన ప్రభుత్వానికి సహకరిస్తాం.ప్రజల తీర్పు గౌరవిస్తున్నామని స్పష్టం చేశారు.

ఇవి శాసనమండలి తొలి సమావేశాలు అని, మండలిలో బీఆర్ఎస్( BRS ) కు మెజారిటీ ఉందని గుర్తించాలన్నారు.ఈ క్రమంలో ప్రజలకు సహకరించాలన్న ఉద్దేశంతో ఓ సందేశం ఇవ్వాలనుకుంటున్నట్లు ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.

ప్రస్తుత ప్రభుత్వం తాము ఏమి చేస్తామో అనేది చెప్పాలి కానీ గత ప్రభుత్వ పాలన అని.ఎన్ని రోజులు చెబుతారు అంటూ విమర్శించారు.తెలంగాణలో ప్రజలకి నష్టాలు కలిగితే తప్పకుండా ప్రశ్నిస్తామని కవిత స్పష్టం చేశారు.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
చంద్రబాబు క్లారిటీతో ఉన్నారా ? అందుకే ఆ స్టేట్మెంట్ ఇచ్చారా ?

ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మేడిగడ్డ పర్యటనకు తీసుకెళ్తానని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.అదేమైనా టూరిస్ట్ స్పాటా అందరినీ తీసుకెళ్లడానికి అంటూ ప్రశ్నించారు.

Advertisement

నిపుణుల ఆధ్వర్యంలో కమిటీ వేసి కమిటీని తీసుకెళ్లండి అని అన్నారు.

తాజా వార్తలు