ఫేస్ రికగ్నిషన్ యాప్ పై టీచర్లతో ప్రభుత్వం చర్చలు సఫలం

విద్యావ్యవస్థలో మార్పులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.ఈ మేరకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పలు విషయాలు వెల్లడించారు.

మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో​ మాట్లాడుతూ.ఉపాధ్యాయ సంఘాలతో రెండు అంశాలపై చర్చించాము.

విద్య, వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఫేస్‌ రికగ్నెజేషన్‌ యాప్‌లో లోపాలు సరిదిద్దాము.

ఈ యాప్‌ అమలు కోసం 15రోజుల గడువు కోరాము.యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని చెప్పాము.

Advertisement

ఫేస్‌ రికగ్నెజేషన్‌ యాప్‌ అమలుకు టీచర్లు అంగీకారం తెలిపారు.విద్యావ్యవస్థలో మార్పులు రావాలనే ఈ నిర్ణయం తీసుకున్నాము.

నాడు-నేడు ద్వారా స్కూళ్లలో మార్పులు తెచ్చాము.మండలానికి ఇద్దరు ఎంఈవోలను నియమిస్తున్నాము.248 పోస్టులను సీనియారిటీపరంగా భర్తీ చేశాము.38 డిప్యూటీ డీఈవో పోస్టులను కొత్తగా ఇస్తున్నాము.మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్‌’ అని స్పష్టం చేశారు.

 .

కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు
Advertisement

తాజా వార్తలు