మండల అభివృద్ధి కి కృషి చేస్తా:ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా:మోటకొండూరు మండల అభివృద్ధి కి కృషి చేస్తానని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు.సోమవారం మోటకొండూరు మండల కేంద్రం నుండి చాడ గ్రామానికి 2 కిలోమీటర్లు డీ.

ఎం.ఎఫ్.టి నిధులతో మంజూరైన బిటీ రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోటకొండూరు మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తానన్నారు.

మండల కేంద్రానికి రావడానికి పరిసర ప్రాంతాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసి ఈ రోడ్డు మంజూరు చేయించడం జరిగిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో మండలంలో సమస్యలన్ని దశలవారీగా పరిష్కరించుకుందామని చెప్పారు.

ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల ప్రజలు సమస్యలపై ఇచ్చిన వినతిపత్రాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఐనాల చైతన్యరెడ్డి,వైస్ చైర్మన్ పచ్చిమట్ల మధార్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ భాస్కరుని రఘునాథరాజు,మార్కెట్ కమిటీ డైరక్టర్ తండా పాండురంగయ్య గౌడ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి మహేందర్,నెమ్మని సుబ్రహ్మణ్యం,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు క్యాసగల్ల చందు,మల్లేశ్,బుగ్గ మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

Karamba Review And Player Reputation — A Practical UK Guide
Advertisement

Latest Yadadri Bhuvanagiri News