Palla Rajeshwar Reddy : ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి..: ఎమ్మెల్యే పల్లా

తెలంగాణ అసెంబ్లీ( Telangana Assembly )లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.కాంగ్రెస్ సర్కార్ కేవలం రెండు హామీలను మాత్రమే అమలు చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి( Palla Rajeshwar Reddy ) అన్నారు.

ఆరు గ్యారెంటీల్లో 13 అంశాలు ఉంటే రెండు అమలు చేశారని పేర్కొన్నారు.రెండు గ్యారంటీలను ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం బాగుందన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆటో డ్రైవర్ల జీవితాలు ఆందోళనలో పడిందని ఆరోపించారు.

ఈ క్రమంలో ప్రభుత్వం స్పందించి ఆటో డ్రైవర్ల(Auto drivers )ను ఆదుకోవాలని, వారిని ప్రతినెలా ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.

ఏఎన్నార్ ఒత్తిడితో మెగాస్టార్ సినిమా వదిలేసిన కోదండరామిరెడ్డి
Advertisement