ప్ర‌భుత్వం వైసీపీది... అధికారం టీడీపీదా.. ఏపీలో ఏం జ‌రుగుతోంది...!

ఏపీలో చాలా జిల్లాల్లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌తో పాటు వైసీపీ నేత‌ల ఉదాసీన‌త చూస్తే పై టైటిల్ నిజ‌మేనా అనిపిస్తుంది.

ప్ర‌భుత్వం వైసీపీ చేతుల్లో ఉంటే మ‌రోవైపు జిల్లాల్లో టీడీపీ నేత‌లు రెచ్చిపోతున్న ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.

అరెస్టు చేస్తే కోర్టుకు వెళ‌తాం.గంట‌లో బెయిల్ తెచ్చుకుంటాం అని స‌వాళ్లు రువ్వుతున్నారు.

Government Is Ysrcp,ruling Is TDP,what Happened In AP..?, Ysrcp, Jagan Mohan Re

బాప‌ట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌పై రాడ్డుతో దాడికి ప్ర‌య‌త్నించిన టీడీపీ నేత పూర్ణ చంద్ర‌రావు ఇదే డైలాగ్ చెప్పారు.దీనిని బ‌ట్టే టీడీపీ నేత‌ల బ‌రి తెగింపు అర్థ‌మ‌వుతోంది.

ఇక టీడీపీ కార్య‌క‌ర్త‌లే కాకుండా నేత‌లు సైతం ఇదే బాట‌లో ఉన్నారు.టీడీపీ మాజీ ఎమ్మెల్యే, హిందూపురం పార్ల‌మెంట‌రీ జిల్లా పార్టీ అధ్య‌క్షుడు బీకే.

Advertisement

పార్థ‌సార‌థి సైతం పోలీసుల‌పై రెచ్చిపోయారు.ఆయ‌న వాహ‌నాల్లో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా కంక‌ర త‌ర‌లిస్తున్నారు.

దీంతో వాటిని పోలీసులు అడ్డుకోవ‌డంతో ఆయ‌న పోలీసుల‌కు ఫోన్ చేసి రెచ్చిపోయారు.స్థానిక ఎస్‌.

ఐకు ఫోన్ చేసిన ఆయ‌న నేనెవ‌రో తెలుసా.తెలిసే నా వాహ‌నాలు అడ్డుకున్నావా ?  నా టిప్ప‌ర్ల‌నే ఆపీ కేసులు పెడ‌తావా ? అని ఆయ‌న చిర్రుబుర్రు లాడారు.ఇక రాష్ట్ర వ్యాప్తంగా అధికారం కోల్పోయిన అస‌హ‌నంలో ఉన్న ప‌లువురు టీడీపీ నేత‌లు ఇప్పుడు పోలీసులు, అధికారుల‌కు వార్నింగ్ ఇవ్వ‌డం సంచల‌నంగా మారింది.

మ‌హా అయితే ఏం చేస్తారు కేసులు పెడ‌తారు ? అప్పుడు మ‌నం కోర్టుల‌కు వెళ్లి బెయిల్ తెచ్చుకోవ‌చ్చ‌న్న ధీమాతోనే ఎక్కువ మంది టీడీపీ నేత‌లు బ‌రి తెగిస్తోన్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.ఏదేమైనా ప్ర‌భుత్వం, అధికార యంత్రాంగం దీనిని క‌ట్ట‌డి చేయాల్సిన అవ‌స‌రం ఉంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు