'గోపీచంద్ 32' షూట్ అప్డేట్.. ఫస్ట్ షెడ్యూల్ అక్కడ స్టార్ట్!

మ్యాచో స్టార్ గోపీచంద్ ( Gopichand ) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

ఈయన గత కొంత కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.

హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు.అయితే హిట్ సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు.

ఇటీవలే రామబాణం సినిమాతో మరో ప్లాప్ అందుకున్న గోపీచంద్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుస సినిమాలను చేస్తున్నాడు.

ప్రస్తుతం గోపీచంద్ డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో భీమా ( Bheema ) సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా చేస్తూనే మరో కొత్త మూవీని ఇటీవలే ప్రకటించాడు.ఈయన కెరీర్ లో 32వ ( Gopichand32 ) సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఒకప్పటి స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల ( Srinu Vaitla ) దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement

ఈ సినిమా ఇటీవలే గ్రాండ్ లాంచ్ అయ్యింది.ఇక ఇప్పుడు షూట్ గురించి మేకర్స్ తాజాగా ఒక అనౌన్స్ మెంట్ చేసారు.ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను ఇటలీ లోని మిలాన్( Milan ) లో గ్రాండ్ గా స్టార్ట్ చేసినట్టు చిత్ర యూనిట్ తెలిపారు.

ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నాం అని.అక్కడ యూరోపియన్ అందాల మధ్య వచ్చే ఈ సీన్స్ అద్భుతంగా ఆకట్టుకునేలా ఉంటాయని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేస్తూ చిన్న వీడియోను వదిలారు.ఈ వీడియో బాగా ఆకట్టుకుంటుంది.

మరి ఎప్పుడో ఫామ్ కోల్పోయిన శ్రీను వైట్ల ఈ సినిమాతో అయినా ఫామ్ లోకి వస్తాడా రాడా అనేది చూడాలి.కాగా చిత్రాలయం స్టూడియోస్ సంస్థపై వేణు దోనేపూడి నిర్మిస్తుండగా టైటిల్ గురించి అప్డేట్ ఒకటి వైరల్ అయ్యింది.ఈ సినిమాకు విశ్వం( Vishwam ) అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు టాక్.

చూడాలి గోపీచంద్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలుస్తుందో లేదో.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు