ఏ శబ్దమైన సంగీతంలా వినిపించే టూల్ ను తీసుకొచ్చిన గూగుల్!

నాకు ఎంతో ఇష్టమైన పాటను నా స్నేహితుడు పాడి వినిపించారు.నా స్నేహితుడి చేతిలో చూస్తే అసలు కంప్యూటర్ తప్ప ఎలాంటి సంగీత పరికరాలు లేవు.

అదే విషయం స్నేహితుడిని అడిగితే ఒక చిన్న నవ్వు నవ్వాడు.నాలో మాత్రం ఇదెలా సాధ్యమని ఒకటే కుతూహలం.

Google New Music Tool Google, DDSP, Music Instrument, Computer, Tone Transfer-

ఇంకొనిసార్లు అదే పనిగా అడిగితే అప్పుడు నిజం చెప్పాడు.గూగుల్ రీసెర్చ్ కు చెందిన మెజెంటా బృందం మిషన్ లెర్నింగ్ సాయంతో మ్యూజిక్ కంపోజర్స్ కోసం కొత్తగా డిఫెరెన్షియబుల్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ (డీడీఎస్ పీ) పేరుతో ఓపెన్ సోర్స్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది.

దీంతో ఎలాంటి సౌండ్ అయినా మనకు నచ్చిన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ పై వాయించినట్లుగా మార్చుకోవచ్చు.ఇది మ్యూజిక్ కంపోజర్స్ కి ఒక వరం అని గూగుల్ తెలిపింది.

Advertisement

దీని ద్వారా మ్యూజిక్ టెక్నాలజీ మరింత సులభతరం అవుతుందని మెజెంటా బృందం అభిప్రాయపడింది.ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ టెక్నాలజీ ఎవరైనా ప్రయత్నించొచ్చు.

ఇందుకోసం టోన్ ట్రాన్స్ఫర్ అనే టూల్ ని గూగుల్ రూపొందించింది.ఇప్పటికే టెక్నాలజీ రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న విషయం మనకు తెలిసిందే, వీటి వల్ల చాలా ఉపయోగం అని కొందరు, మానవాళికి అసలు పని లేకుండా పోతుంది అని మరి కొందరు అభిప్రాయపడ్తున్నారు.

ఇకపై టెక్నాలజీ లో ఇంకా ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.

వృద్ధాప్యాన్ని వాయిదా వేసే అద్భుతమైన పానీయం
Advertisement

తాజా వార్తలు