CM KCR TSPSC :తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ TSPSC నుండి మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో ఇచ్చిన మాట ప్రకారం వరుసగా నోటిఫికేషన్ లు విడుదల చేస్తూ ఉంది.

ఈ ఏడాది ప్రారంభంలో మార్చి నెలలో అసెంబ్లీ సాక్షిగా లక్ష ఉద్యోగాలకు సంబంధించి జాబ్ నోటిఫికేషన్ లు విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ మాట ఇచ్చారు.

కాగా ఇచ్చిన మాటకు తగ్గట్టుగానే TSPSC గత కొన్ని నెలల నుండి వరుస నోటిఫికేషన్ లు రిలీజ్ చేస్తూ ఉంది.ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం తెలంగాణ వైద్యశాఖ ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం తెలిసింది.1147 పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా TSPSC నుండి మరో నోటిఫికేషన్ విడుదలయ్యింది.

Good News For Telangana Unemployed Another Job Notification Release From Tspsc-

విషయంలోకి వెళ్తే డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో 18 డ్రగ్ ఇన్ స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.ఇందుకు సంబంధించి డిసెంబర్ 16 నుంచి జనవరి 5 వరకు దరఖాస్తుల స్వీకరిస్తామని పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు