మ‌త్స్య‌కారుడిని వ‌రించిన అదృష్టం.. ఆ ఒక్క చేప ఎంతో తెలిస్తే..?

అదృష్టం ఏ రూపంలో ఎవ‌రిని వ‌రిస్తుందో చెప్ప‌డం ఎవ‌రి త‌రం కాదు.మ‌రీ ముఖ్యంగా మత్స్యకారుల విష‌యంలో ఇది చాలా అరుదుగా జ‌రుగుతూ ఉంటుంది.

అయితే వీరంతా కూడా ఎప్పుడూ గంగమ్మ తల్లిని నమ్ముకొని బ‌తుకుతుంటారు.ఎప్పుడూ సముద్రంలోనే జీవిస్తూ అందులో దొరికే చేప‌ల మీదే వారికి జీవనాధారం ఉంటుంది.

ఇక అప్పుడ‌ప్పుడు కొంద‌రికి ఈ చేప‌ల రూపంలోనే క‌లిసి వ‌స్తూ ఉంటుంది.ఎందుకంటే కొన్ని సార్లు అరుదైన చేప‌లు దొర‌క‌డంతో వారు ల‌క్షాధికారులు అయిపోతూ ఉంటారు.

ఇప్పుడు కూడా ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది.తూర్పుగోదావరి జిల్లా అంటేనే చేప‌ల‌కు పెట్టింది పేరు.

Advertisement
Good Luck To The Fisherman What If That One Fish Knew So Much, Fish, Viral News,

ఎందుకంటే ఇక్క‌డ గోదావ‌రి అటు స‌ముద్రం రెండింటిలో ఈ జిల్లా వాసులు చేప‌లు ప‌డుతూ ఉంటారు.ఇక ఈ జిల్లాలోని సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో ఓ విచ‌త్రం జ‌రిగింది.

అదేంటంటే ఇక్క‌డ ఉండే మినీ ఫిషింగ్ హార్బర్ నుంచి కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన కొంద‌రు చేప‌లు ప‌ట్టే వారు వెళ్ల‌గా వారికి ఓ అరుదైన చేప దొరికింది.అవేంటంటే స‌ముద్రంలో చాలా అరుదుగా దొరికే కచిలి చేపలు వారి వ‌ల‌కు చిక్కాయి.

ఇవి దాదాపుగా 16 కిలోలున్న ఒక మగ చేప, అలాగే 15 కిలోలున్న ఒక ఆడ చేప వారి వ‌ల‌లో ప‌డ్డాయ‌ని తెలుస్తోంది.

Good Luck To The Fisherman What If That One Fish Knew So Much, Fish, Viral News,

ఇక ఈ అరుదైన చేప‌లు కొనేందుకు ఫిషింగ్ హార్బర్ వ‌ద్ద వ్యాపారులు ఒకేసారి మంచి ఆస‌క్తి చూపించ‌డంతో బాగా డిమాండ్ పెరిగింది.అయితే మగ చేప దాదాపుగా లక్ష రూపాయలకు పైగా అమ్మారు ఈ చేప‌లు ప‌ట్టేవారు.అలాగే ఆడ చేప మాత్రం లక్షలోపు ధరకు అమ్ముడు పోయిన‌ట్టు తెలుస్తోంది.

చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయా..? అయితే ఈ అలవాట్లు మానేయండి..

ఇక్క‌డ వీటి విశేషం ఏంటంటే ఈ చేప పొట్ట భాగాన్ని మందుల తయారీలో వినియోగిస్తుండ‌టంతో వీటికి ఇంత డిమాండ్ ఏర్ప‌డింది.ఈ విష‌యాన్ని వీటిని ప‌రీక్షించిన అధికారులు వివ‌రించారు.

Advertisement

ఇంకో విష‌యం ఏంటంటే వీటిని ఇక్క‌డ కాకుండా వేరే రాష్ట్రాల్లోనే డిమాండ్ ఉంటుందంట‌.

తాజా వార్తలు