మీ వీర్యం మీ చేతుల్లోనే ఉంది

మనిషి ఎలా ఉన్నా, అది తన అలవాట్ల వల్లే.మంచి అలవాట్లు ఉంటే ఆరోగ్యవంతుడు.

చెడు అలవాట్లు ఉంటే వ్యాధిగ్రస్తుడు.ఏదైనా తన చెతుల్లోనే.

ఇక మనిషి పుట్టుకకు కారణం వీర్యం.ఇది లేనిదే మనిషి లేడు.

దాని ఉత్పత్తి లేనిదే సంతానం లేదు.అందుకే వీర్యం చాలా విలువైనది.

Advertisement

దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి.అలా ఉంచుకోవాలంటే మంచి అలవాట్లు అలవరచుకోవాలి.

ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ల అధికవాడకం వీర్యకణాల కౌంట్ ని తగ్గిస్తుంది.అయినా వదల్లేం.

అర్థరాత్రి దాకా టీవి చూసుకుంటూ కూర్చుంటే సరిపోయేంత నిద్ర దొరకదు.సరైన నిద్ర లేకపోతే స్ట్రెస్ తో బాధపడాలి.

స్ట్రేస్ తెచ్చే చిక్కుల్లో సెక్స్ సమస్యలు, వీర్య కణాల కౌంట్ తరుగుదల కూడా ఉన్నాయి.అసలు ఎక్కువసేపు టీవి చూడటమే పెద్ద ప్రమాదం.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
పూరి జగన్నాధ్ హీరో గా చేయాల్సిన ఆ సినిమాలు ఎవరి కోసం త్యాగం చేసాడు

అయినా, ఈ అలవాట్లను వదల్లేం.పొద్దున్న లేస్తూనే, మొబైల్ చేతిలో పడతాం కాని నీళ్ళ గ్లాసు పట్టుకోం.

Advertisement

నీళ్ళు ఎంత ఎక్కువ తాగితే, వీర్యం అంత బలంగా తయారవుతుంది.పొద్దున్నే లేచాక కనీసం రెండు గ్లాసుల నీళ్ళు ఖచ్చితంగా తాగాలి.రోజుకి కనీసం 3.7 లీటర్ల నీళ్ళు తాగాలి మగవాళ్ళు.మద్యం ఎన్నోరకాలుగా శరీరానికి హానికరం.

ఇక వీర్యానికి ఇది ప్రధాన శతృవు.అయినా మద్యాన్ని మానడం మానవతరం కావట్లేదు.

ఈ అలవాట్లే మనిషి వీర్యాన్ని బలహీనపరుస్తున్నాయి.మీరు బాగుండి, మీ పిల్లలకు అరోగ్యకరమైన జీన్స్ ను అందించాలంటే, మీ అలవాట్లు బాగుండాలి, మీ వీర్యం బలంగా ఉండాలి ! మీ వీర్యం, మీ చేతుల్లోనే ఉంది.