అది పవన్ కళ్యాణ్ కోసం రాసిన కథట..!

సత్యదేవ్ హీరోగా గోపీ గణేష్ డైరక్షన్ లో వస్తున్న సినిమా గాడ్సే.

సినిమా కథను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నానని అన్నారు డైరక్టర్ గోపీ గణేష్.

గాడ్సే కథను పవన్ తో చేయాలని అనుకున్నా కానీ ఆయనతో చేయలేకపోయాను కనీసం సినిమాని అయినా ఆయనకు చూపించాలని అనుకుంటున్నా అని అన్నారు గోపీ గణేష్.జూన్ 17న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో సినిమాకు సంబందించిన విషయాలను మీడియాతో పంచుకున్నారు డైరక్టర్ గోపీ గణేష్.

సత్యదేవ్ తో ఆల్రెడీ బ్లఫ్ మాస్టర్ సినిమా చేసిన గోపీ గణేష్ మరోసారి గాడ్సేతో మెప్పించాలని చూస్తున్నారు.ఇందులో సత్యదేవ్ ఓ కామన్ మెన్ పాత్రలో నటించారు.

సినిమాను ప్రతి కామన్ మెన్ కనెక్ట్ అవుతారని నమ్మకంగా చెబుతున్నారు డైరక్టర్ గోపీ గణేష్.ఈ సినిమాలో నేటి విద్యా వ్యవస్థని చర్చించామని అన్నారు డైరక్టర్.

Advertisement

కేవలం చదివిన చదువుకి ఆరు శాతం మాత్రమే సరిపోయే ఉద్యోగం చేస్తున్నారు పాతికేళ్ల పాటు జీవితాన్ని పణంగా పెట్టి చదువుకుంటే దానికి ఫ్యూచర్ ప్రయోజనం లేకపోతే ఎలా అన్న ప్రశ్న నుంచే ఈ కథ వచ్చిందని అన్నారు డైరక్టర్ గోపీ గణేష్.

Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich
Advertisement