ఖరీదైన క్రీములు అక్కర్లేదు.. ఈ చిట్కాతో సహజంగానే అందంగా మెరిసిపోండి!

సాధారణంగా అధిక శాతం మంది అందంగా మెరిసిపోవడం కోసం మార్కెట్లో లభ్యమయ్యే ఖరీదైన క్రీములను కొనుగోలు చేసి వాడుతుంటారు.కానీ ఖరీదైన క్రీములు అక్కర్లేదు.

ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను కనుక పాటిస్తే సహజంగానే అందంగా మరియు కాంతివంతంగా మెరిసిపోవచ్చు.చర్మం పై మొండి మచ్చల‌ను నివారించుకోవచ్చు.

ముడతలను మాయం చేసుకోవచ్చు. క్లియర్ అండ్ వైట్ స్కిన్ ను త‌మ సొంతం చేసుకోవచ్చు.

మరి ఇంతకీ ఆ చిట్కా ఏంటి అనేది ఏ మాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ప‌ది టేబుల్ స్పూన్ల వరకు పచ్చి పాలు వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసి ఐదు నిమిషాల పాటు వదిలేయాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నిమ్మరసం కలిపిన పాలు వేసుకోవాలి.

అలాగే చిటికెడు కుంకుమ పువ్వు, పావు టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్ వేసుకుని ఒక నిమిషం పాటు గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు చందనం పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకొని కనీసం ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

రెండు రోజులకు ఒకసారి ఈ సింపుల్ ఇంటి చిట్కాను కనుక పాటిస్తే చర్మం మృదువుగా తెల్లగా మరియు కోమలంగా మారుతుంది.ముడతలు మొండి మచ్చలు ఏమైనా ఉంటే క్రమంగా తగ్గు ముఖం పడతాయి.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

చర్మం అందంగా మరియు కాంతివంతంగా మెరిసిపోతుంది.ఈ చిట్కాని పాటిస్తే ఎలాంటి క్రీములు అక్కర్లేదు.

Advertisement

సహజంగానే క్లియర్ అండ్ బ్యూటిఫుల్ స్కిన్ ను తమ సొంతం చేసుకోవచ్చు.కాబ‌ట్టి, త‌ప్ప‌కుండా ఈ సింపుల్ ఇంటి చిట్కాను ట్రై చేయండి.

తాజా వార్తలు