గ్లోబల్ స్టార్ కూడా 'ఏజెంట్' కోసం రాబోతున్నాడా.. క్లారిటీ ఇదే!

మన టాలీవుడ్ హీరోలు (Tollywood Heroes) ఒకరి సినిమాల ప్రమోషన్స్ లో మరొకరు పాల్గొనడం ఎప్పుడు చూస్తూనే ఉంటాం.

ఇలా మన హీరోలు ఈగోలకు వెళ్లకుండా ఒకరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు మరొకరు వస్తుంటారు.

ఇక స్టార్ హీరోలు చిన్న హీరోలకు కూడా వారి సపోర్ట్ ను ఎప్పుడు అందిస్తారు.చిన్న హీరోల సినిమా ఈవెంట్లకు పెద్ద హీరోలు వస్తే ఆ సినిమా ప్రమోషన్స్ కు బాగా ఉపయోగ పడుతుంది.

అందుకోసమే చిన్న హీరోలు తమ ప్రమోషన్స్ లో స్టార్ హీరోలను భాగం చేస్తూ ఉంటారు.అలా అయినా తమ సినిమా ప్రేక్షకులకు బాగా రీచ్ అవుతుంది అని.మరి తాజాగా మన టాలీవుడ్ లో రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాల్లో అక్కినేని అఖిల్ (Akhil Akkineni) ఏజెంట్ (Agent) సినిమా ఒకటి.మాస్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 28న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.

యాక్షన్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కొన్ని కారణాల వల్ల గత రెండేళ్లుగా సెట్స్ మీదనే ఉంది.ఎట్టకేలకు పూర్తి చేసుకుని ఇప్పుడు రిలీజ్ కు రెడీ అయ్యింది.ఇక రిలీజ్ కు మరో వారం మాత్రమే ఉండడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

మరి ఈ ఈవెంట్ (Agent Pre Release Event) కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ను తీసుకు రాబోతున్నారు అంటూ వస్తారని టాక్ రావడం ఇది ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అవ్వడం జరిగాయి.మరి డార్లింగ్ ప్రభాస్ మాత్రమే కాకుండా మరో గ్లోబల్ స్టార్ కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చే అవకాశం ఉందని గట్తిగానే టాక్ వినిపిస్తుంది.

ఈ ఇద్దరు స్టార్స్ వచ్చే అవకాశం కూడా ఉంది అని టాక్.ఎలాగూ అఖిల్ కు చరణ్ కు మంచి స్నేహం ఉంది.అందుకే ఏజెంట్ కోసం చరణ్ (Ram Charan) కూడా వచ్చిన ఆశ్చర్యం లేదు అంటున్నారు.

మరి దీనిపై రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?
Advertisement

తాజా వార్తలు