శుక్రవారం పెళ్లి చేసి అమ్మాయిని అత్తవారింటికి పంపుతున్నారా.. అయితే ఇలా చేయాల్సిందే!

మన హిందూ సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను ఎంతో నిబద్ధతగా పాటించేవారికి ఎన్నో సందేహాలు తలెత్తుతుంటాయి.

వారు చేసే ప్రతి కార్యం కూడా ఎంతో పద్ధతిగా పూజ ఫలితాలను ప్రయోజనాలను తెలుసుకొని పూజిస్తుంటారు.

ఈ నేపథ్యంలోనే కొందరికి శుక్రవారం పెళ్లిళ్లు జరిపించవచ్చా అనే సందేహం కూడా కలుగుతుంది.నిజంగానే శుక్రవారం పెళ్లిళ్లు చేయకూడదా? చేస్తే ఏమవుతుంది? అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.చాలామంది వీలైనంతవరకు శుక్రవారం పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడానికి ఇష్టపడరు.

కాకపోతే కొన్ని జాతకాల వల్ల లేక పేరు బలాలు వల్ల శుక్రవారం ముహూర్తాలను పెట్టుకుంటూ ఉంటారు.మన హిందువులు శుక్రవారం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి కి ఎంతో విశిష్టమైన రోజుగా భావిస్తారు.

అందుకోసమే శుక్రవారం అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారు.అదేవిధంగా మన ఇంట్లో ఆడపిల్ల ఉంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు.

Is It Right To Do Marriages On Friday, Friday Marriages, Marriages On Friday, Fr
Advertisement
Is It Right To Do Marriages On Friday, Friday Marriages, Marriages On Friday, Fr

లక్ష్మీ స్వరూపంగా భావించి ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపుతుంటారు.ఈ విధంగా పంపించడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి బయటకు వెళ్లి పోతుందని భావిస్తుంటారు.ఈ క్రమంలోనే ఎవరైతే శుక్రవారం వివాహం జరిపిస్తారో అలాంటివారు వారి అమ్మాయిని అదే రోజు అత్తింటికి పంపించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది.

మన ఇంటి అమ్మాయిని అత్తింటివారు తీసుకెళ్లే ముందు అత్తింటి వారిని మన ఇంటి గడప పై ఒక చిన్న బంగారు వస్తువునైనా ఉంచి మన ఇంట్లోని ఆడపిల్లను వారి ఇంటికి తీసుకెళ్లవచ్చు.ఈ విధంగా శుక్రవారం బంగారం రూపంలో మన ఇంటికి మహాలక్ష్మి వస్తే, వారి ఇంటికి మహాలక్ష్మిగా నవ వధువు అత్తవారింట్లో కాలు పెడుతుంది.

Advertisement

తాజా వార్తలు