ముఖంపై అసహ్యంగా కనిపించే బ్లాక్ హెడ్స్ ను ఈజీగా వదిలించుకోండిలా!

బ్లాక్ హెడ్స్.( Black Heads ) అంటే చర్మంపై ఏర్పడే చిన్న, నల్లటి మచ్చలు.

చర్మం అధికంగా నూనెను ఉత్పత్తి చేయడం, చనిపోయిన చర్మ కణాలు, బ్యాక్టీరియా, హార్మోన్ల మార్పులు త‌దిత‌ర‌ అంశాలు బ్లాక్ హెడ్స్ ఏర్పడడానికి కారణం అవుతుంటాయి.ఇవి ముఖంపై ప్రధానంగా ముక్కు, నుదురు మ‌రియు గడ్డంపై ఎక్కువగా కనిపిస్తుంటాయి.

అబ్బాయిలు పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోయినా అమ్మాయిలు మాత్రం బ్లాక్ హెడ్స్ ను చాలా సీరియ‌స్‌గా తీసుకుంటారు.వాటిని తొల‌గించుకునేందుకు నానా తంటాలు ప‌డుతుంటారు.

మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా? ముఖంపై బ్లాక్ హెడ్స్ అసహ్యంగా కనిపిస్తున్నాయా.? డోంట్‌ వర్రీ.ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని పాటిస్తే చాలా ఈజీగా బ్లాక్ హెడ్స్ వదిలించుకోవచ్చు.

Get Rid Of Blackheads Easily With This Home Remedy Details, Home Remedy, Blackh
Advertisement
Get Rid Of Blackheads Easily With This Home Remedy Details, Home Remedy, Blackh

అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో అర కప్పు వాటర్ పోసుకోవాలి.వాటర్ బాయిల్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon Juice ) వేసి మిక్స్ చేయాలి.ఆపై వన్ టేబుల్ స్పూన్ షుగర్,( Sugar ) వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee Powder ) వేసి బాగా మిక్స్ చేసి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు హీట్ చేయాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాఫీ మిశ్రమంలో పావు టీ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

Get Rid Of Blackheads Easily With This Home Remedy Details, Home Remedy, Blackh

ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చేతులకు కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకుని చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ ప్యాక్ ను తొలగించాలి.ఫైనల్ గా వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుని మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.

ఈ సింపుల్ రెమెడీని పాటించారంటే ముఖంపై ఏర్పడిన బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగిపోతాయి.డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ అవుతాయి.చర్మం క్లియర్ అండ్ గ్లోయింగ్ గా మారుతుంది.

అందరికి బతుకు పోరాటం అంత సులువుకాదు సుమా.. ఇతన్ని చూసి నేర్చుకోవాల్సిందే!
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ డిసిజన్స్ మారిపోయాయా..?

అందంగా మెరుస్తుంది.

Advertisement

తాజా వార్తలు