'జార్జ్‌రెడ్డి' మూవీ రివ్యూ మరియు రేటింగ్‌

ఉస్మానియా యూనివర్శిటీ స్టూడెంట్‌ లీడర్‌ అయిన జార్జ్‌రెడ్డి గురించి ఈతరం వారికి చాలా మందికి తెలియదు.

ఈ సినిమా వస్తుందన్నప్పటి నుండే జార్జ్‌రెడ్డి గురించి సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలైంది.

ఆయన గురించి జనాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపించారు.అలా జార్డ్‌రెడ్డి సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

మరి అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

జార్జ్‌ రెడ్డి జీవిత చరిత్రనే ఈ సినిమాలో కథ.జార్జ్‌ రెడ్డి చిన్నప్పుడు ఎలా సాగింది, ఆయన కుటుంబం హైదరాబాద్‌కు ఎలా వచ్చారు.ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీలో ఆయన చదువు, క్లాస్‌లు ఎలా సాగాయి, స్టూడెంట్‌ లీడర్‌గా ఎలా ఎదిగాడు, ఎలా హత్య చేయబడ్డాడు అనేది సినిమా కథాంశం.

చాలా సహజంగా అనిపించేలా కథను తెరకెక్కించారు.

Advertisement

నటీనటుల నటన :

జార్జ్‌రెడ్డి పాత్రను సందీప్‌ మాధవ్‌ పోషించాడు.ఈయన గతంలో సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు దక్కించుకోలేక పోయాడు.ఈ సినిమాతో విడుదలకు ముందే ఫేమ్‌ దక్కించుకున్నాడు.

ఇక జార్జ్‌రెడ్డి పాత్రను ఈయన దించేశాడు.నిజంగా జార్జ్‌ రెడ్డి ఇలాగే ఉండేవాడా, ఇలాగే ప్రవర్తించేవాడా అన్నట్లుగా నటించాడు.

అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా సందీప్‌ మాధవ్‌ నటించి మెప్పించాడు.ఇంకా ఇతర పాత్రల్లో శ్రీనివాస్‌ పోకలే, సత్యదేవ్‌ చక్కని నటనతో మెప్పించారు.

ముఖ్యంగా సత్యదేవ్‌ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.ప్రతి ఒక్కరు కూడా ఆకట్టుకున్నారు.

ఆరోగ్యానికి సమోసా మంచిదా? బర్గర్ మంచిదా?.. అధ్యయనంలో తేలిందిదే...

టెక్నికల్‌ :

జార్జ్‌రెడ్డి సినిమాలోని పాటలు మరియు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సందర్బానుసారంగా ఉండి ఆకట్టుకుంది.ముఖ్యంగా సినిమాలోని ఎమోషనల్‌ సీన్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంది.

Advertisement

ఇక ఉద్యమ బ్యాక్‌ డ్రాప్‌లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా మెప్పించే విధంగా ఉంది.సినిమాటోగ్రఫీ బాగుంది.

ప్రేక్షకులను అప్పటి పరిస్థితులకు తీసుకు వెళ్లడంలో సినిమాటోగ్రాఫర్‌ సక్సెస్‌ అయ్యాడు.ఇక ఆర్ట్‌ డైరెక్టర్‌ కూడా చాలా బాగా పనితనం చూపించాడు.

ఆయన వేసిన ఉస్మానియా యూనివర్శిటీ సెట్టింగ్‌ నిజమైనదేనా అన్నట్లుగా అనిపించింది.ఇక దర్శకుడు జీవన్‌ రెడ్డి మొదటి నుండి అనుకుంటున్నట్లుగానే జార్జ్‌ జీవితాన్ని ఆవిష్కరించాడు.

ఎడిటింగ్‌లో చిన్న చిన్న లోపాలున్నాయి.నిర్మాణాత్మక విలువల బాగున్నాయి.

విశ్లేషణ :

మెగా ఫ్యామిలీ మద్దతు మరియు ఏబీవీపీ వివాదం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా జార్జ్‌ రెడ్డి సినిమా భారీ ఎత్తున చర్చ జరుగుతోంది.అన్ని విధాలుగా సినిమా బ్లాక్‌ బస్టర్‌ అంటూ టాక్‌ వచ్చింది.అయితే సినిమా అనుకున్నట్లుగానే ఉంది.

కాని కథనంను కాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌ వేలో చూపించి ఉంటే బాగుండేది.అలాగే జార్జ్‌ రెడ్డికి సంబంధించిన అన్ని పాజిటివ్‌ విషయాలను మాత్రమే చూపించారు.

ఒక వ్యక్తికి చీకటి వెలుతురు రెండు పార్శాలు ఉంటాయి.అయితే ఈ సినిమాలో మాత్రం జార్జ్‌ రెడ్డి వెలుతురు పార్శంను మాత్రమే చూపించారు.

జార్జ్‌ రెడ్డిని అభిమానించే వారికి ఈ సినిమా నచ్చుతుంది.

ప్లస్‌పాయింట్స్‌ :

జార్జ్‌రెడ్డి పాత్ర, కొన్ని విద్యార్థి ఉదమ్య సీన్స్‌, యూనివర్శిటీ సీన్స్‌,

మైనస్‌ పాయింట్స్‌ :

కొన్ని యాక్షన్‌ సీన్స్‌, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేకపోవడం.

బాటమ్‌ లైన్‌

: జార్జ్‌ రెడ్డికి ఇది ఘన నివాళి అన్నట్లుగా ఉంది.రేటింగ్‌ : 2.75/5.0.

తాజా వార్తలు