పొట్టలో గ్యాస్ నిండిపోయి ఉబ్బరంగా ఉందా.. అయితే ఇలా చేయండి..!

సాధారణంగా ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రజలు సమస్యతో బాధపడుతున్నారు.

అయితే ఏదైనా తినాలనిపించినప్పుడు కాస్త తినగానే కడుపు అంతా నిండిపోయి ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది.

ఇంకాస్త తింటే పొట్ట ఎక్కడ పేలిపోతుందో అనే భావన కలుగుతుంది.ఇక నావల్ల కాదు అని చాలామంది తినకుండా అలాగే ఉంటారు.

ఇదంతా గ్యాస్ ప్రాబ్లమ్( Gas Problem ) అని దాదాపు అందరికీ తెలుసు. జలుబు, దగ్గు వచ్చి తగ్గినట్టు ఈ సమస్య అంత సులువుగా తగ్గదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కానీ ఈ ఒక్క చిట్కా పాటిస్తే ఎంతో వేధించే ఈ సమస్యను కూడా సులభంగా దూరం చేసుకోవచ్చు.ఆ చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముఖ్యంగా చెప్పాలంటే సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువసేపు కూర్చోని పని చేయడం, శరీరక శ్రమ లేకపోవడం వల్ల గ్యాస్ సమస్య వస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.ఇలాంటి సమయంలో పులుపు పదార్థాలు ఎక్కువగా తింటే సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.మన ఇంట్లో ఎప్పుడూ నిల్వ ఉండే వాము గ్యాస్ సమస్యకు మంచి పరిష్కారం అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

అర టీ స్పూన్ వాము( Ajwain ), కొద్దిగా పింక్ సాల్ట్( Pink Salt ),ఒక టీ స్పూన్ ఇంగువ( Asafoetida ) తీసుకోవాలి.ఈ మూడింటిని ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లలో కలుపుకుని ప్రతిరోజు భోజనానికి అరగంట ముందు త్రాగడం ఎంతో మంచిది.

ఇలా 15 రోజులపాటు క్రమం తప్పకుండా చేయడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు, ప్రేగులకు సంబంధించిన సమస్యలు, కడుపులో గ్యాస్ ఉత్పత్తి కావడం వంటివి దూరమవుతాయి.

ముఖ్యంగా చెప్పాలంటే వాము వేడెక్కించే గుణాన్ని కలిగి ఉంటుంది.అందుకే తిన్న ఆహారం సులభంగా జీర్ణం చేస్తుంది.శరీరంలో ఎక్కువైనా వాతాన్ని,కాఫన్ని తిరిగి సాధారణ స్థాయికి తీసుకుని వస్తుంది.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?

ఇంగువలో కూడా వాములో ఉండే గుణాలే ఎక్కువగా ఉంటాయి.ఇది వాతాన్ని సాధారణ స్థాయికి తీసుకురావడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

Advertisement

కడుపు ఉబ్బరం( Gastric Problem ), కడుపు నొప్పి, మలబద్ధకం, కడుపులో పురుగులు వంటి సమస్యలను తగ్గిస్తుంది.ఇంకా చెప్పాలంటే పింక్ సాల్ట్ చలువ చేస్తుంది.

ఇది శరీరంలో వాత, పిత్త, కఫ గుణాలను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.చాతి బిగుతుకుపోయినట్లు ఉండడం మంటగా అనిపించడం వంటి సమస్యలను దూరం చేస్తుంది.

తాజా వార్తలు