కరీంనగర్ జిల్లాలో గ్యాస్ లీకేజీ కలకలం

కరీంనగర్ జిల్లాలో గ్యాస్ లీక్ అయిన ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తుంది.నీటి శుద్ధి ప్లాంట్ లో ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది.

ఈ మేరకు ఫిల్టర్ బెడ్ లోని హైడ్రో క్లోరిన్ గ్యాస్ ఒక్కసారిగా లీక్ అయింది.వాల్ బ్లాక్ అవడంతో ఈ ప్రమాదం సంభవించిందని ప్లాంట్ నిర్వాహకులు చెబుతున్నారు.

లీకైన హైడ్రో క్లోరిన్ గ్యాస్ ప్లాంట్ అంతటా వ్యాపించింది.కాగా నీటిని శుద్ధి చేసేందుకు గానూ ఈ గ్యాస్ ను వినియోగిస్తారు.

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది లీక్ అవుతున్న గ్యాస్ ను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement
పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తాజా వార్తలు