‘గంజాయి వద్దు బ్రో’.. ఏపీలో టీడీపీ వినూత్న కార్యక్రమం

ఏపీలో గంజాయి దందా పెరిగిపోతున్న నేపథ్యంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు.

గంజాయి వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ చైతన్యం తీసుకువచ్చే దిశగా గంజాయి వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు ఆయన తెలిపారు.

గంజాయి కారణంగా యువత భవిష్యత్ నాశనం అవుతుందన్నారు.తాడేపల్లి, తిరుమలలో గంజాయి లభ్యం అవుతుందని ఆయన ఆరోపించారు.

ఈ నేపథ్యంలో గంజాయి భూతాన్ని తరిమి కొట్టేంత వరకు టీడీపీ పోరాటం కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?
Advertisement

తాజా వార్తలు