పోలీసులు నన్ను రక్కి,నా చొక్కా చింపారు అంటూ సంచలన ఆరోపణలు చేసిన ఎంపీ

ఇటీవల ఏపీ అసెంబ్లీ ముట్టడి కోసం పిలుపునిచ్చిన టీడీపీ పార్టీ ఈ క్రమంలో పలువురు టీడీపీ నేతలు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమంలో అరెస్ట్ ఆయిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ జైలు నుంచి మంగళవారం రిలీజ్ అయ్యారు.

ఈ క్రమంలో ఆయన ఏపీ పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు.వారు నాతొ చాలా దురుసుగా ప్రవర్తించారు అని ఆయన మండిపడ్డారు.

ఎంతో శాంతియుతంగా ఆందోళన చేపట్టిన నాపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు అని గోళ్ళ తో రక్కి,చొక్కా చింపి లాఠీ పట్టుకొని నాపై బెదిరింపులకు దిగినట్లు తెలిపారు.ఒకానొక సమయంలో నాపై చేయి చేసుకుంటారేమో అన్నంతగా భయపెట్టారు అంటూ ఆయన ఆరోపించారు.

నన్ను అరెస్ట్ చేసిన పోలీసులు దాదాపు 15 గంటల పాటు తిప్పారని,చివరికి వైద్యం కావాలని అడిగినా ఏమాత్రం పట్టించుకోలేదని గల్లా మండిపడ్డారు.నాకు 149 సెక్షన్ నోటీసు ఇవ్వ లేదు అని, నా ఇంటికి కూడా నోటీసులు ఇవ్వలేదని గల్లా ఆరోపించారు.

Advertisement
Galla Jayadev Sensational Comments On Ap Police-పోలీసులు నన

నిరసన చేసుకునే హక్కు మాకు ఉంది.మేము అంత శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు మధ్యలో వచ్చి అడ్డుకున్నారు.

లాఠీ ఛార్జ్ చేస్తే తుళ్లూరు మహిళలు నన్ను కాపాడారు.పోలీసులు నా చొక్కా చింపి గోళ్లతో రక్కారు.

Galla Jayadev Sensational Comments On Ap Police

ఎస్పీ విజయరామారావు చేతిలో కూడా లాఠీ ఉంది.ఆయన నన్ను కొడతారు అని భయపడ్డాను.వైద్య సదుపాయం కావాలని కోరినా పట్టించుకోలేదు.

ఫోటోలు కూడా తీసుకొనివ్వ లేదు.నా సెల్ ఫోన్ లాక్కున్నారు.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

పోలీసు జీపు లోనే వైద్య పరీక్షలు చేసి జైలుకి పంపారు.ఒక ఎంపీకే ఇలా జరిగితే సామన్యుడి పరిస్థితి ఏంటని ఏపీ ప్రభుత్వం, పోలీసులపై విమర్శలు గుప్పించారు గల్లా జయదేవ్.

Advertisement

తాజా వార్తలు