కాంగ్రెస్‎లో చేరిన గద్వాల జెడ్పీ ఛైర్ పర్సన్..!

గద్వాల జెడ్పీ ఛైర్ పర్సన్ సరిత కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ మేరకు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో సరిత దంపతులు హస్తం గూటికి చేరారు.

ఇదివరకు బీఆర్ఎస్ లో ఉన్న సరిత దంపతులతో పాటు 30 మంది సర్పంచ్ లు, 12 మంది ఎంపీటీసీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని సమాచారం.అయితే గతంలో కుట్రలు చేసి బలమైన నాయకులను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.

అలాగే ఈ సారి గద్వాల జిల్లాలో ఎగిరేది కాంగ్రెస్ జెండానేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.పాలమూరు జిల్లాలో 14కు 14 సీట్లను సాధించుకుందామన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పాలమూరు ఎత్తిపోతలను పూర్తి చేస్తామని తెలిపారు.

ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని వెల్లడించారు.

Advertisement
పెద‌వులు పింక్‌గా, షైనీగా మారాలా? నెయ్యితో ఇలా చేయండి!