సందడే సందడి.. టాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలు అయిపోతుందిగా?

టాలీవుడ్ లో హీరోలకు కొదువ లేదు.

సీనియర్ హీరోలు స్టార్ హీరోలు, మిడ్ రేంజ్ హీరోలు, చిన్న హీరోలు ఇలా అందరూ కలిసి చాలా మంది ఉంటారు.

ఎప్పుడూ ఏదో ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే ఉంటారు.దీంతో టాలీవుడ్ బాక్సాఫీస్ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది.

కానీ కరోనా వైరస్ కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు రాలేక.ప్రేక్షకులు ధైర్యం చేసి థియేటర్లకు వచ్చినా థియేటర్లో తెరుచుకోక.

ఒకవేళ థియేటర్ లు తెరుచుకున్న సినిమా నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేయడానికి ధైర్యం చేయలేక.టాలీవుడ్ బాక్సాఫీస్ మొత్తం వెలవెలబోయింది అని చెప్పాలి.

Advertisement
Full Josh In Tollywood , Tollywood , Full Josh , Tollywood Box Office , Corona

దీంతో ఇక సినీ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతగానో నిరాశలో మునిగిపోయారు.

Full Josh In Tollywood , Tollywood , Full Josh , Tollywood Box Office , Corona

కానీ 2022 సీజన్లో మాత్రం తెలుగు బాక్సాఫీస్ వద్ద సందడి మామూలుగా లేదు అని చెప్పాలి.ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రభాస్ లాంటి పెద్ద హీరోలు తెలుగు ప్రేక్షకులను పలకరించారు.ఇక మధ్యలో తమిళ హీరో సూర్య సైతం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఇక మరికొన్ని రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కూడా త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.ఇలా మొన్నటి వరకు ఏ సినిమా రిలీజ్ లేక ఖాళీగా ఉన్న థియేటర్లు ఇక ఇప్పుడు ప్రేక్షకులతో కిక్కిరిసి పోతున్నాయి.

ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తాయి.ఇక 2022 సంవత్సరంలో మొదట విడుదలైన పెద్ద హీరో సినిమా బంగార్రాజు సినిమా బాక్స్ ఆఫీస్ కి బూస్ట్ ఇచ్చింది.

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!

ఇటీవలే విడుదలైన భీమ్లా నాయక్ సినిమా బాక్సాఫీస్ వద్ద మరింత జోష్ నింపింది.

Full Josh In Tollywood , Tollywood , Full Josh , Tollywood Box Office , Corona
Advertisement

ఇక ఇదే జోరు కొనసాగిస్తూ ఇటీవలే పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ విడుదలైంది.ఇక ఈ వీకెండ్లో ప్రేక్షకులు అందరూ కూడా రాదే శ్యాం సినిమా కి ఓటు వేస్తున్నారు.భారీ హైప్ తో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది.

ఇక ఈ సినిమా మేనియా ముగిసేలోపేమార్చ్ 25వ తేదీన త్రిబుల్ ఆర్ మేనియా ప్రారంభం కాబోతుంది.ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల అందరూ కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా నుంచి ప్రేక్షకులు బయటపడతారో లేదో రామ్ చరణ్ చిరంజీవి కలిసి నటించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక అటు వెంటనే మే 12వ తేదీన పరశురాం మహేష్ బాబు కాంబో సర్కారు వారి పాట రాబోతుంది.

ఇలా కాస్తయినా బ్రేక్ లేకుండా ప్రేక్షకులను అలరించేందుకు బాక్సాఫీస్ దగ్గర తమ సత్తా చాటేందుకు టాలీవుడ్ హీరోలందరూ సిద్ధమైపోయారు.

" autoplay>

తాజా వార్తలు