పారేసే పండ్ల తొక్కలతో అందానికి మెరుగులు.. ఏది ఎలా వాడాలంటే?

ఈ ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన ఆహారాల్లో పండ్లు ఒకటి.నిత్యం రెండు రకాల పండ్లను తీసుకుంటే మన ఆరోగ్యం పదిలంగా ఉన్నట్లే.

అయితే పండ్లు తినే సమయంలో వాటికి ఉండే తొక్కల‌ను బయట పారేస్తుంటాము.కానీ పండ్ల తొక్కల్లో కూడా ఎన్నో విలువైన పోషకాలు ఉంటాయి.

పారేసే పండ్ల తొక్కలతో అందానికి మెరుగులు పెట్టుకోవచ్చు.మరి ఏ పండు తొక్క‌ను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బొప్పాయి పండు( Papaya fruit )ను తినే సమయంలో తొక్కను పీల్ చేసి డస్ట్ బిన్ లోకి తోసేస్తుంటారు.కానీ ఇకపై అలా చేయకండి.

Advertisement
Fruit Peel Face Masks For Healthy And Glowing Skin , Ace Masks, Glowing Ski

బొప్పాయి పండు తొక్కలను ఒకసారి వాటర్ తో కడిగి మిక్సీ జార్ లో స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేయండి.ఈ మిశ్రమం లో వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) కలిపి ముఖానికి, మెడకు అప్లై చేసుకోండి.10 నిమిషాల తర్వాత చర్మాన్ని క్లీన్ చేసుకోండి.బొప్పాయి తొక్కలు చర్మం పై పేరుకుపోయిన మృత కణాలను తొలగిస్తుంది.

స్కిన్ ను స్మూత్ అండ్ షైనీగా మెరిపిస్తుంది.

Fruit Peel Face Masks For Healthy And Glowing Skin , Ace Masks, Glowing Ski

అలాగే యాపిల్ పండు తొక్కల‌ను( Apple peels ) తీసుకుని ఒక గ్లాసు వాటర్ లో వేసి బాగా మరిగించాలి.ఆ వాటర్ ను ఫిల్టర్ చేసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ కలిపితే మంచి టోనర్ సిద్ధం అవుతుంది.ఈ టోనర్ ను ముఖానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకుని 20 నిమిషాల అనంతరం వాష్ చేసుకోవాలి.

ఇలా చేయడం వల్ల చర్మం టైట్ గా మారుతుంది.ముడతలు ఏమైనా ఉంటే త‌గ్గుముఖం పడతాయి.మరియు స్కిన్ గ్లోయింగ్ గా మెరుస్తుంది.

Fruit Peel Face Masks For Healthy And Glowing Skin , Ace Masks, Glowing Ski
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

ఇక నిమ్మ పండు తొక్కల‌ను ( Lemon peels )పారేయకుండా బాగా ఎండబెట్టి పౌడర్ చేసుకోవాలి.వన్ టేబుల్ స్పూన్ నిమ్మ తొక్కల పౌడర్ లో వన్ టేబుల్ స్పూన్ పెరుగు, చిటికెడు పసుపు కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల అనంతరం కడిగేయాలి.

Advertisement

ఇలా కనుక చేస్తే చర్మం పై మొండి మచ్చలు మాయమవుతాయి.మొటిమలు తగ్గుముఖం పడతాయి.

స్కిన్ వైట్ గా మారుతుంది.షైనీగా మెరుస్తుంది.

తాజా వార్తలు