మునుగోడు బ‌రిలో ష‌ర్మిల పార్టీ నుంచి..! బ‌లం ఎంతో మ‌రి..!!

రాష్ట్రంలో మునుగోడు హాట్ టాపిక్ గా మ‌రింది.

కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా చేసి ఉప ఎన్నిక తేవ‌డంతో మ‌రో రెండు నెల‌ల్లో ఎన్నికజ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయి.

అయితే ఎలాగైనా మునుగుడులో జెండా పాతాల‌ని మూడు ప్ర‌ధాన పార్టీలు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి.అధికార పార్టీ టీఆర్ఎస్ బాస్ రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామాకు ముందు నుంచే అక్క‌డ ఫోక‌స్ పెట్టారు.

అక్క‌డి నేత‌ల‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు.అలాగే కాంగ్రెస్ తమదే ఆ సీటు అని త‌మ దైన శైలిలో రేవంత్ వ్యూహ ర‌చ‌న చేస్తున్నారు.

ఇక బీజేపీలో చేరుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ ని చూసుకుని ఈ సీటు మాదే అంటోంది బీజేపీ.అలాగే వామపక్షాలు కూడా తామూ అక్కడ బాగానే ఉన్నామని అంటున్నాయి.

Advertisement

అయితే ఈ పరిస్థితిలో తన తండ్రి వైఎస్సార్ పేరిట పార్టీ పెట్టిన షర్మిల మునుగోడు ఉప ఎన్నికలో అభ్యర్థిని నిలబెడుతుందా అన్న చ‌ర్చ కూడా వినిపిస్తోంది.తెలంగాణ‌లో ఏడాదిన్నర క్రితమే షర్మిల వైఎస్సార్టీపీని పెట్టి పాద‌యాత్ర‌లు చేస్తున్నారు.

ప్రజా స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ అండ‌గా ఉంటామ‌ని చెబుతున్నారు.ఇక ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగింద‌ని.కేసీఆర్ సర్కార్ అన్ని విధాలుగా విఫలం అయిందని ప్ర‌జ‌ల్లో బ‌లంగా వినిపిస్తున్నారు.

హామీలు కూడా ఇచ్చేస్తున్నారు.ఇక వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని ష‌ర్మిల భావిస్తుండ‌గా ఇప్పుడు ఉప ఎన్నిక రావ‌డంతో ఇక్క‌డి నుంచే పోటీ చేయ‌డం మొద‌లు పెడితే బాగుంటుంద‌ని అంటున్నారు.

How Modern Technology Shapes The IGaming Experience
మన భారతీయ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?

ఇక్క‌డ అభ్య‌ర్థిని బ‌రిలోకి దింపితే.

Advertisement

ఉమ్మ‌డి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ఎక్క‌వగా ఉండ‌టంతో వైఎస్సార్ అభిమానులు కూడా ఎక్కువ‌గా ఉన్న జిల్లా.అలాగే షర్మిల పార్టీకి కూడా చెప్పుకోదగిన నాయకులు ఇక్కడ ఉన్నారు.మరి తెలంగాణ‌లో తన సత్తాను చాటాలనుకున్నా తన పవర్ ఏంటో చూపించాలనుకున్నా షర్మిల పార్టీ పోటీ చేయడమే ఉత్త‌మ‌మ‌ని అంటున్నారు.

వాస్త‌వానికి టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు వైఎస్సార్టీపీని అస‌లు లెక్క‌లోకే తీసుకోవ‌డం లేదు.కాబ‌ట్టి ఇలాంటి స‌మ‌యంలోనే పార్టీ నుంచి అభ్య‌ర్థిని నిల‌బెడితే రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతుంది.

గెలుపు అనేది సాధ్యం కాక‌పోయినా కొంతైనా ప్ల‌స్ అవుతుంద‌ని అంటున్నారు.నిజానికి ష‌ర్మిల పార్టీపై తెలంగాణ స‌మాజానికి పెద్దగా అంచ‌నాలు లేవు.

ఈ ఎన్నిక‌లో పోటీ గ‌నుక చేస్తే తెలంగాణ స‌మాజం పార్టీ బ‌ల‌మేంటో తెలుసుకునే అవ‌కాశం ఉంటుంది.అందుకే ష‌ర్మిల అభ్య‌ర్థిని బ‌రిలోకి దింపితేనే బెటర్ అంటున్నారు.

మరి షర్మిల ఆ దిశగా అడుగులు వేస్తారా.? లేదా వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చూసుకుందాం అని లైట్ తీసుకుంటారా.వేచి చూడాల్సిందే.

మొత్తానికి ఇక్క‌డ వైఎస్సార్టీపీ నుంచి అభ్య‌ర్థ‌ని దింపితేనే ప్ర‌జ‌ల్లోకి పార్టీ వెళ్ల‌గ‌లుగుతుంద‌ని అంటున్నారు.లేదంటే ఎలాంటి అంచనాలు లేకుండా 2023 ఎన్నికలకు వెళ్తే ఫలితాలు షాక్ ఇచ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.

చూడాలి మ‌రి ష‌ర్మిల ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో.

తాజా వార్తలు