దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉచిత వైద్య చికిత్స

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని నర్సింహులపల్లె గ్రామములో శుక్రవారం సురభి వైద్య విజ్ఞాన సంస్థ సిద్దిపేట అధ్వర్యంలో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉచిత పరీక్షలతో పాటు బస్సు సౌకర్యం కల్పిస్తూ గ్రామం నుంచి దాదాపు 40 మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని దవాఖానకు తీసుకువెళ్లడం జరిగింది.

వారికి ఉచితంగా వైద్య పరీక్షలు చేయించి మందులు ఇచ్చి ఆపరెషన్లు అవసరం ఉన్న వారికి కూడా ఆపరేషన్లు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.

ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నచో వారికి ఎప్పటికైనా ఉచిత పరీక్షలు చేస్తూ ఆపరెషన్ పై డిస్కౌంట్, మందులకు డిస్కౌంట్ తో సేవలందిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమములో నేరెళ్ళ పాక్స్ వైస్ చైర్మన్ బొంగరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ అవకాశాన్ని మన గ్రామ ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మన గ్రామానికి 10 రోజులకు ఒక్కసారి బస్సు రావడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమములో హాస్పిటల్ పి ఆర్ ఓ పర్శరాములు ఉప సర్పంచ్ శేఖర్,బిఆర్ ఎస్ పార్టీ యూత్ నాయకులు బొంగరం జనార్థన్ రెడ్డి,మేనేజ్మెంట్ సురభి వెంకటేశ్వర్రావు, మార్కెటింగ్ ఎగ్జక్యూటివ్ రాజు, వినయ్, డ్రైవర్ కనకయ్య, నాయకులు చెక్కపల్లి లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Happy Luke Bonuses: A Practical Breakdown For UK Players
Advertisement

Latest Rajanna Sircilla News