మార్కెట్ బాక్స్ ట్రేడింగ్ యాప్ తో ఘ‌రానా మోసం

రాజ‌స్థాన్, యూపీలో సైబ‌రాబాద్ పోలీసులు భారీ సెర్చ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు.దీనిలో భాగంగా న‌లుగురు సైబ‌ర్ నేర‌గాళ్ల‌ను అరెస్ట్ చేసిన‌ట్టు సీపీ స్టీఫెన్ ర‌వీంద్ర తెలిపారు.

మార్కెట్ బాక్స్ అనే ట్రేడింగ్ యాప్ ను రూపొందించిన కేటుగాళ్లు.పెట్టుబ‌డులు, ట్రేడింగ్ పేరుతో జంట న‌గ‌రాల్లో వేల మంది ద‌గ్గ‌ర కోట్లాది రూపాయ‌లు వ‌సూలు చేసిన‌ట్లు గుర్తించారు.

కొట్టేసిన డ‌బ్బుతో వ్యాపారాలు చేస్తూ బిజినెస్ మెన్ లుగా కొన‌సాగుతున్న అభిషేక్ జైన్, ప‌వ‌న్ కుమార్ ప్ర‌జాప‌త్, ఆకాష్ రాయ్, కృష్ణ కుమార్ ల‌ను సైబ‌రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.అయితే సైబ‌ర్ నేర‌గాళ్ల నుండి ఇంత పెద్ద మొత్తంలో న‌గ‌దు వ‌సూలు చేయ‌డం దేశంలో ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం.

వాడిన కాఫీ పొడిని మ‌ళ్లీ ఇలా కూడా వాడొచ్చు.. తెలుసా?
Advertisement