కడప జిల్లాలో రోడ్డుప్రమాదం.. నలుగురు దుర్మరణం

వైఎస్ఆర్ కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఆటో - బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు మృత్యువాత పడ్డారు.

మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.బాధితులను హుటాహుటిన చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
మన ఇంటి ఆనంది మనోళ్లకు పెద్దగా నచ్చలేదు.. జాంబిరెడ్డి హీరోయిన్ ఆనంది గురించి ఆసక్తికర విషయాలు