కాంగ్రెస్ ప్రక్షాళన దిశగా రాహుల్ .. సొంత టీం ఏర్పాటు ? 

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ( congress )ను ప్రక్షాళన చేసే ఆలోచనతో ఉన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ).

ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ లో భారీగా మార్పు చేర్పులు చేపట్టేందుకు కసరత్తు మొదలుపెట్టారు.

  పూర్తిగా తన సొంత టీం ను ఏర్పాటు చేసుకునే ప్రయత్నాల్లో రాహుల్ గాంధీ బిజీగా ఉన్నారు.ఈ మేరకు సంస్థ గత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిని మార్చబోతున్నట్లు ఏఐసిసి వర్గాలు పేర్కొంటున్నాయి.

అలాగే మరి కొంతమంది ప్రధాన కార్యదర్శులను తప్పించి వారి స్థానంలో కొత్తవారికి బాధ్యతలు అప్పగించాలని రాహుల్ భావిస్తున్నారట.ఈ మేరకు ఏఐసీసీ  కార్యదర్శులుగా 35 మందితో జాబితాను కూడా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

  కొద్ది రోజుల్లోనే సంస్థ గత మార్కులపై అధికారికంగా ప్రకటన విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Forming Rahuls Own Team To Clean Up The Congress, Rahul Gandhi, Congress, Congr
Advertisement
Forming Rahul's Own Team To Clean Up The Congress, Rahul Gandhi, Congress, Congr

ముఖ్యంగా తెలంగాణ,  కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీలుగా ఉన్న ప్రధాన కార్యదర్శులను మార్చి,  మాజీ ముఖ్యమంత్రులకు ఆ బాధ్యతలను అప్పగించనున్నట్లు సమాచారం.దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని ఏఐసీసీ ( AICC )నుంచి కొంత మంది కీలక నేతలను తమ సొంత రాష్ట్రాలకు పంపించి కీలక బాధ్యతలను అప్పగించే ఆలోచనతో రాహుల్ ఉన్నారట .కాంగ్రెస్ సంస్థగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఉన్న కేసి వేణుగోపాల్ ( KC Venugopal )ను తప్పిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.కేసి వేణుగోపాల్ వ్యవహార శైలి పై పార్టీలోని సీనియర్ నేతలు చాలాకాలంగా అసహనంతో ఉండడంతో,  రాహుల్ గాంధీ సైతం ఆయనను తప్పించే ఆలోచనతో ఉన్నారట.కేసి వేణుగోపాల్ ను పూర్తిగా పక్కనపెట్టి మొత్తం 35 మందిని ఏఐసీసీ కార్యదర్శులుగా ని యమించబోతున్నట్లు సమాచారం.35 మందితో కూడిన ఏఐసిసి కార్యదర్శిల జాబితాను రూపొందించే విషయంలో రాహుల్ గాంధీకి సచిన్ రావు,  మీనాక్షి నటరాజన్ , శశికాంత్ సెంథిల్ ( Sachin Rao, Meenakshi Natarajan, Shasikant Senthil )సహకారం అందించారట. 

Forming Rahuls Own Team To Clean Up The Congress, Rahul Gandhi, Congress, Congr

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడుగా సచిన్ రావు కమ్యూనికేషన్ నిపుణులు.సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ గతంలో మధ్యప్రదేశ్ నుంచి ఎంపీగా ఉన్నారు.రాహుల్ గాంధీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయనకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారు.

ఇక శశికాంత్ సెంథిల్ మాజీ ఐఏఎస్ అధికారి.రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తమిళనాడు నుంచి ఎంపీగా గెలుపొందారు.

ఈ ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులకు ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసి సమర్థులైన వారిని ఎంపిక చేసినట్లు సమాచారం.

హీరో హీరోయిన్స్ గా నటించి అన్నాచెల్లెళ్లుగా చేసిన టాలీవుడ్ యాక్టర్స్
Advertisement

తాజా వార్తలు