Koneru Konappa : బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రాజీనామా

లోక్ సభ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్( BRS ) కు మరో షాక్ తగిలింది.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప( Koneru Konappa ) గులాబీ పార్టీకి రాజీనామా చేశారు.

ఈ క్రమంలోనే ఆయన రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy )తో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలతో కోనేరు కోనప్ప భేటీ అయిన సంగతి తెలిసిందే.

కాగా అసెంబ్లీ ఎన్నికల్లో( Assembly Elections ) బీఆర్ఎస్ ఓటమి పాలవడంతో పాటు తాజాగా బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడాన్ని కోనేరు కోనప్ప తీవ్రంగా వ్యతిరేకించారు.ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఆయన బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరనున్నారని సమాచారం.

పెద‌వులు పింక్‌గా, షైనీగా మారాలా? నెయ్యితో ఇలా చేయండి!
Advertisement