మాజీమంత్రి కొడాలి నాని హాట్ కామెంట్స్

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీలోకి ఆహ్వానించడానికి లోకేశ్ ఎవరని ప్రశ్నించారు.

టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ కు అప్పగించాలని కొడాలి అన్నారు.మార్పు రావాల్సింది రాష్ట్రంలో కాదన్న ఆయన టీడీపీలో ఛేంజ్ రావాలన్నారు.

ఎన్టీఆర్ ఫ్యామిలీని చంద్రబాబు ఘోరంగా అవమానించలేదా అని నిలదీశారు.హరికృష్ణకు కూడా పదవులు ఇవ్వకుండా దూరం పెట్టారని విమర్శించారు.

చంద్రబాబు, లోకేశ్ బొమ్మతో ఓట్లు అడిగే ధైర్యం లేదన్నారు.అందుకే జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీలోకి రమ్మంటున్నారని తెలిపారు.

Advertisement

చంద్రబాబు నాయకత్వంలో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని ఎద్దేవా చేశారు.

దూరం పెట్టారంటూ ప్రముఖ కోలీవుడ్ నటి ఖుష్బూ ఆవేదన.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు