అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన కీలక నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు( Gollapalli Surya Rao ) వైసీపీ గూటికి చేరారు.
టీడీపీకి( TDP ) రాజీనామా చేసిన ఆయన సీఎం జగన్( CM Jagan ) సమక్షంలో వైసీపీలో చేరారు.
ఈ క్రమంలో ఆయనకు కండువా కప్పిన సీఎం జగన్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.అయితే టీడీపీ - జనసేన పొత్తులో భాగంగా పార్టీ అధిష్టానం రాజోలు నియోజకవర్గ టికెట్ ను( Rajolu Constituency Ticket ) జనసేనకు కేటాయించింది.
దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన గొల్లపల్లి టీడీపీ హైకమాండ్ నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో పార్టీని వీడారు.అయితే రాజోలు నియోజకవర్గంలో ఇంతకముందు జనసేన ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక వరప్రసాద్ ఇప్పటికే వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.తాజాగా గొల్లపల్లి కూడా వైసీపీలో( YCP ) చేరారు.
దీంతో రాజోలు వైసీపీ అభ్యర్థిగా సీఎం జగన్ ఎవరి పేరును ఖరారు చేస్తారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy