ఆ స్టార్ హీరోకి తండ్రిగా చిరు.. ఇండస్ట్రీని ఊపేస్తున్న క్రేజీ న్యూస్?

టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) గురించి మనందరికీ తెలిసిందే.

విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా నటించిన అర్జున్ రెడ్డి (Arjun Reddy)సినిమాతో టాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.

ఆ తర్వాత రన్బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ (Animal)సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయారు సందీప్ రెడ్డి వంగా.రష్మిక మందన(Rashmika Mandana) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

అయితే ఈ సినిమా షూటింగ్ టైంలోనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో(Rebel Star Prabhas) స్పిరిట్ సినిమాను ప్రకటించాడు సందీప్.

అలాగే ఈ మూవీలో డార్లింగ్‌ ను ఫస్ట్ టైమ్ పోలీస్ యూనిఫాంలో చూపించబోతున్నానంటూ ఫస్ట్ అప్డేట్‌ తోనే సినిమాపై అంచనాలు పెంచేశాడు.అలాగే రెబల్ స్టార్ ఇందులో రూత్‌లెస్ వైల్డ్ పోలీస్‌(Ruthless Wild Police) గా చూపించబోతున్నాయని కూడా సందీప్ అన్నాడు.ఇది ఇలా ఉంటే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ వార్త వైరల్‌ గా మారింది.

Advertisement

అదేమిటంటే ఈ సినిమాల్లో ప్రభాస్‌ కు జంటగా లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) హీరోయిన్‌ గా నటించబోతోందట.దాదాపు 17 సంవత్సరాల క్రితం ప్రభాస్ హీరోగా వచ్చిన యోగి సినిమాలో నయనతార హీరోయిన్‌ గా నటించింది.

మళ్లీ ఈ కాంబో రిపీట్ అవ్వలేదు.

ఇన్నేళ్లకు మళ్ళీ ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయన్న టాక్‌ కూడా వినిపిస్తుంది.అలాగే ఈ సినిమాలో ఒక కీలకమైన గెస్ట్ రోల్‌లో, అది కూడా ప్రభాస్‌ కు తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటిస్తున్నారని టాలీవుడ్ సర్కిల్లో ఒక కేజీ వార్త వైరల్‌ గా మారింది.దీంతో ప్రభాస్ సినిమాలో చిరంజీవి గెస్ట్ రోల్‌ విషయం పై ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో అదిరిపోయే డిస్కషన్లు జరుగుతున్నాయట.

ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊపేస్తోంది.ఒకవేళ ఇదే కనుక నిజమైతే మొదటిసారి ప్రభాస్కు హీరోగా నటించబోతున్నాడు మెగాస్టార్.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!
Advertisement

తాజా వార్తలు