మోస్ట్ అడ్వాన్స్డ్ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ( ChatGPT ) ప్రపంచపు రూపురేఖలను మార్చేస్తోంది.
ఒకప్పుడు డైట్, ట్రావెల్, స్టడీ, ఇతర అంశాలకు సంబంధించిన ప్లాన్స్ కోసం జనాలు ఇంటర్‌నెట్‌లో చాలా సేపు వెతికేవారు.
దాంతో చాలా సమయం వృధా అయ్యేది.అయితే ఇపుడు అలాంటి సమస్య లేదు.
అడ్వాన్స్డ్ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ అందుబాటులోకి వచ్చాక ఇంటర్నెట్ యూజర్లకు ఆ భారం తగ్గిందనే చెప్పుకోవాలి.మీకు సరిగ్గా ప్రశ్నలు అడగడం రావాలే గానీ చాట్‌జీపీటీ క్షణాల్లో మీరు అడిగినవాటికి సమాధానం అందిస్తుంది.
ముఖ్యంగా డైట్ ప్లాన్ చేసుకోవాలనుకునే వారికి చాట్‌జీపీటీ ఉత్తమంగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తిలేదని అంటున్నాడు ఓ అనుభవజ్ఞుడు.
అవును, ఇపుడు మీరు డైటీషన్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే చాట్‌జీపీటీ ద్వారా అద్భుతమైన ప్రయోజనాలను పొందొచ్చని "గ్రెగ్ ముషెన్( Greg Mushen)" అనే వ్యక్తి చెబుతున్నాడు.ఆ బాట్ అందించిన డైట్ ప్లాన్‌ను ఫాలో కావడం ద్వారా గ్రెగ్ ఏకంగా 26 పౌండ్లు అంటే 11 కిలోలు వరకు బరువు తగ్గాడని చెప్పుకొస్తున్నాడు.ఇలాంటి మెరుగైన ప్లాన్ కోసం సరైన ప్రాంప్ట్స్ అందించాలని గ్రెగ్ తెలిపాడు.
సాధారణంగా ప్రజలు ఆరోగ్యం కోసం, బరువు పెరగడానికి, బరువు తగ్గడానికి, అదేవిధంగా స్ట్రెంత్ పెంచుకోవడానికి, తదితర కారణాలకు డైట్ ప్లాన్ చేసుకుంటారు.వీటిలో దేనికోసం డైట్ ప్లాన్ కావాలనుకుంటున్నారో ఆ విషయాన్ని చాట్‌జీపీటీకి స్పష్టంగా తెలియజేస్తే చాట్‌జీపీటీ ద్వారా సరైన డైట్ చార్ట్ క్రియేట్ అవుతుంది.
అదేవిధంగా బరువు తగ్గడాని( Lose weight)కి ప్రయత్నించేవారు తక్కువ కేలరీలు, న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండేలా డైట్ ప్లాన్ కోసం చాట్‌జీపీటీని అడగవచ్చు.అయితే చాట్‌జీపీటీని డైట్ ప్లాన్ కోసం అడిగేటప్పుడు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పడం చాలా ముఖ్యం.హైట్, వెయిట్, ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాటి గురించి తెలపడం కూడా చాలా అవసరం.
తర్వాత వెజిటేరియన్ ఫుడ్ ప్రిఫర్ చేస్తున్నారా లేదంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ కావాలనుకుంటున్నారా అనే వివరాలను కూడా ప్రాంప్ట్‌లో రాయాల్సి ఉంటుంది.కుకింగ్ టైమ్ ఎంత ఉండాలనేది తెలపడంతో పాటు సౌత్ ఇండియన్ మీల్‌సా? లేదంటే నార్త్ ఇండియా మీల్‌సా? డైట్ బడ్జెట్ ఎంత లోపు ఉండాలి? వంటి వివరాలను కూడా కూడా అందించిన తరువాత చాట్‌జీపీటీ మీకు ఖచ్చితమైన బెస్ట్ డైట్ ప్లాన్ అందిస్తుంది.గమనిక: అనారోగ్యాలతో బాధపడుతున్నవారు మాత్రం ఆరోగ్య నిపుణులను కలవడం ఉత్తమం.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy