కన్నుమూసిన ఫుట్‌బాల్ కింగ్ పీలే.. శోకసంద్రంలో మునిగిన అభిమానులు..

కొంతకాలంగా పెద్దప్రేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ పీలే (82) గురువారం రోజు తుది శ్వాస విడిచారు.

బ్రెజిల్‌లోని సావో పాలోలోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ హాస్పిటల్‌లో ఆయన గురువారం అర్ధరాత్రి కన్నుమూశారు.

పీలే 2021, సెప్టెంబర్‌లో పెద్దపేగు క్యాన్సర్‌కు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది.దాంతో ఈ స్టార్ ప్లేయర్ నవంబర్ 29 నుంచి ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడం ప్రారంభించారు.

మరణానికి కొన్ని రోజుల ముందు అతను తన పిల్లలు, మనవరాళ్లతో పాటు ఫొటో దిగారు.పీలే తన స్వదేశం బ్రెజిల్‌ను మూడుసార్లు వరల్డ్ ఛాంపియన్‌గా నిలిపారు.

పీలే లీడర్‌షిప్‌లో బ్రెజిల్ 1958, 1962, 1970 సంవత్సరాల్లో వరల్డ్ కప్‌ను గెలుచుకుంది.పీలే మొత్తం 4 వరల్డ్ కప్‌లు ఆడితే అందులో మూడు ప్రపంచకప్‌లు గెలిచి.

Advertisement

ఆ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించారు.పీలే 15 ఏళ్ల నుంచే ఫుట్‌బాల్ ఆడటం ప్రారంభించి 16 ఏళ్ల వయసులోనే బ్రెజిలియన్ నేషనల్ టీమ్‌లో ప్లేస్ సంపాదించారు.

ఈ స్టార్ ప్లేయర్ 1971లో బ్రెజిల్ నేషనల్ టీమ్‌ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించారు.పీలే టోటల్‌గా 1363 ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడి 1281 గోల్స్ సాధించి తనకంటే గొప్ప ప్లేయర్ ఎవరూ లేరని నిరూపించుకున్నారు.

పీలే కూతురు అతని మరణాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ధ్రువీకరించింది.మేం నిన్ను చాలా ప్రేమిస్తున్నాం.మీ ఆత్మకు శాంతి కలగాలి అని ఆమె పేర్కొంది.

పీలే చనిపోయారనే చేదు నిజాన్ని ఫుట్‌బాల్ లవర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.అతని ఆత్మకు శాంతి కలగాలని కోలుకుంటున్నారు.

How Modern Technology Shapes The IGaming Experience
How Modern Technology Shapes The IGaming Experience

ఫుట్‌బాల్ ఉన్నంతవరకు ప్రజల హృదయాల్లో పీలే సజీవంగానే ఉంటారని మరికొందరు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు