ఈ చిట్కాను పాటిస్తే హెయిర్ ఫాల్ మ‌రియు చుండ్రుకు బై బై చెప్పొచ్చు!

హెయిర్ ఫాల్‌, చుండ్రు.జుట్టు స‌మ‌స్య‌ల్లో ప్ర‌ధానంగా వేధించే వాటిలో ఈ రెండే ముందు ఉంటాయి.

స్త్రీలే కాదు పురుషులు సైతం ఈ రెండు స‌మ‌స్య‌ల‌తో తీవ్రంగా మ‌ద‌న ప‌డిపోతూ ఉంటారు.ఈ క్ర‌మంలోనే హెయిర్ ఫాల్‌, చుండ్రు స‌మ‌స్య‌ల‌ను వ‌దిలించుకోవ‌డం కోసం చేయాల్సిన ప్ర‌య‌త్నాల‌న్నీ చేస్తుంటారు.

ఖ‌రీదైన హెయిర్ ఆయిల్స్‌, షాంపూలు, సీర‌మ్స్ వాడుతుంటారు.ర‌క‌రకాల హెయిర్ ప్యాకులు, మాస్క్‌లు వేసుకుంటారు.

అయినప్ప‌టికీ ఫ‌లితం లేకుంటే ట్రీట్‌మెంట్స్ వ‌ర‌కు వెళ్తారు.కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే ప‌వ‌ర్ ఫుల్ చిట్కాను పాటిస్తే ఆ అవ‌స‌రం మీకు అక్క‌ర్లేదు.

Advertisement

స‌హ‌జంగానే హెయిర్ ఫాల్ మ‌రియు చుండ్రు స‌మ‌స్య‌ల‌కు బై బై చెప్పొచ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఒక మీడియం సైజ్ అల్లం ముక్క‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి స‌న్న‌గా తురుముకోవాలి.ఈ తురుము నుండి ప‌ల్చ‌టి వ‌స్త్రం సాయంతో అల్లం జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.

అలాగే ఒక క‌ల‌బంద ఆకుల‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి.లోప‌ల ఉండే జెల్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల క‌ల‌బంద జెల్‌, నాలుగు టేబుల్ స్పూన్ల అల్లం జ్యూస్, రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పౌడ‌ర్‌, వ‌న్ టేబుల్ స్పూన్ ఆముదం వేసుకుని అన్నీ క‌లిసే వ‌ర‌కు మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు అప్లై చేసుకుని.ష‌వ‌ర్ క్యాప్‌ను ధ‌రించాలి.గంట అనంత‌రం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ట్రై చేయాల్సిందే!

వారంలో రెండు సార్లు ఈ చిట్కాను ఫాలో అయితే హెయిర్ ఫాల్ క్ర‌మంగా త‌గ్గుతుంది.అదే స‌మ‌యంలో చుండ్రు స‌మ‌స్య నుండి ఉప‌శ‌మ‌నం సైతం ల‌భిస్తుంది.

Advertisement

తాజా వార్తలు