చిగుళ్ల నుంచి తరచూ రక్తం వస్తుందా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

సాధారణంగా కొందరికి చిగుళ్ల( Gums ) నుంచి తరచూ రక్తం వస్తుంటుంది.చిగుళ్ల వ్యాధి యొక్క ప్రారంభ లక్షణం ఇది.

చిగురువాపు, కఠినమైన టూత్ బ్రష్ లను వాడటం, నోటి ప‌రిశుభ్ర‌త లేక‌పోవ‌డం, ఎక్కువసేపు బ్రష్ చేయడం, ధూమపానం, పోషకాల కొరత పలు రకాల రుగ్మతల కారణంగా చిగుళ్ల నుంచి రక్తం వస్తుంటుంది.చిగుళ్ల నుంచి రక్తస్రావం అనేది సాధారణ నోటి సమస్యల్లో ఒకటి అయినప్పటికీ.

దానిని నిర్లక్ష్యం చేస్తే మాత్రం అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఈ నేపథ్యంలోనే చిగుళ్ల రక్తస్రావం సమస్యకు అడ్డుకట్ట వేసే కొన్ని సింపుల్ అండ్ ఎఫెక్టివ్ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చిగుళ్ల నుంచి రక్తస్రావం( Bleeding ) అవుతున్న వారికి ఉప్పు నీరు చాలా బాగా సహాయపడుతుంది.ప్రతిరోజు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ ఉప్పు( salt ) కలపాలి.

Advertisement

ఈ ఉప్పు నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మేయాలి.రోజుకు రెండు సార్లు ఈ విధంగా చేయడం వల్ల చిగుళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

చిగుళ్ల నుంచి రక్తస్రావం రాకుండా ఉంటుంది.తేనె( honey ) కూడా మీ సమస్యకు పరిష్కారాన్ని అందిస్తుంది.

రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తేనెను చిగుళ్లపై అప్లై చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల చిగుళ్లలో బ్యాక్టీరియా తగ్గుతుంది.

మరియు చిగుళ్ల రక్తస్రావం నుండి ఉపశమనం పొందవచ్చు.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

అలాగే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో చిన్న కప్పు కొబ్బరి నూనె( coconut oil ), ఒక స్పూన్ లవంగాలు( cloves ) వేసి చిన్న మంట‌పై దాదాపు పది నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ లవంగాల నూనె చిగుళ్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Advertisement

నిత్యం ఈ లవంగాల నూనెను చిగుళ్ళకు అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.తద్వారా చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తస్రావం వంటి సమస్యలు దూరం అవుతాయి.

బలహీనమైన చిగుళ్లు బలోపేతం అవుతాయి.

గమ్ బ్లీడింగ్ పేలవమైన నోటి పరిశుభ్రతకు సంకేతం.కాబట్టి నోటిని శుభ్రంగా ఉంచుకోండి.రోజుకు రెండు సార్లు బ్రష్ చేయండి.

అలాగే కఠినమైన బ్రష్ లను వాడటం మానుకోండి.ధూమపానం అలవాటును వదులుకోండి.

విటమిన్ కె, విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆహారాలను డైట్ లో చేర్చుకోండి.రోజు ఒక కప్పు గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకోండి.

గ్రీన్ టీ తాగడం వల్ల చిగుళ్ల రక్తస్రావం నుండి ఉపశమనం పొందవచ్చు.ఎందుకంటే ఇందులో కాటెచిన్ అనే సహజ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది.

కాటెచిన్ నోటిలోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.చిగుళ్ళు మరియు దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

తాజా వార్తలు