మూడు రోజులకు ఒకసారి ఈ చిట్కాను పాటిస్తే మొటిమలు తొంగి కూడా చూడవు!

మొటిమలు.సర్వసాధారణంగా వేధించే చర్మ సమస్యల్లో ఒకటి.

టీనేజ్ ప్రారంభం అయ్యిందంటే చాలు పనిగట్టుకుని మరీ వచ్చి మొటిమలు ముప్ప‌ తిప్పలు పెడుతుంటాయి.

కొందరు అమ్మాయిలు మొటిమల కారణంగా తీవ్ర మానసిక శోభకు గురవుతుంటారు.

మొటిమల‌ను ఎలా వదిలించుకోవాలో అర్థం గాక లోలోన మదన పడిపోతూ ఉంటారు.మీరు కూడా ఈ జాబితాలో ఉంటే ఇకపై టెన్షన్ వదిలేయండి.

ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ చిట్కాను మూడు రోజులకు ఒకసారి పాటిస్తే మొటిమలు తొంగి కూడా చూడవు.మొటిమలకు దూరంగా ఉండాలని భావించే వారికి ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది.

Advertisement
Follow This Tip Once In Three Days To Get Rid Of Acne , Acne, Acne Treatment, Si

మరి ఇంతకీ ఆ చిట్కా ఏంటి అనేది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నీమ్ పౌడర్ ను వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

Follow This Tip Once In Three Days To Get Rid Of Acne , Acne, Acne Treatment, Si

చివరిగా సరిపడా బియ్యం కడిగిన వాటర్ ను వేసి మరోసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖం మొత్తానికి కాస్త మందంగా అప్లై చేసుకుని ఆరబెట్టుకోవాలి.చర్మం పూర్తిగా డ్రై అయిన అనంతరం వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.మూడు రోజులకు ఒకసారి ఈ చిట్కాని పాటిస్తే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు క్రమంగా మాయమవుతాయి.

Follow This Tip Once In Three Days To Get Rid Of Acne , Acne, Acne Treatment, Si

అలాగే తరచూ మొటిమలు వేధించకుండా సైతం ఉంటాయి.పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల చర్మంపై మురికి, మృతకణాలు తొలగిపోతాయి.ఆయిలీ స్కిన్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

చర్మం నిత్యం ప్రకాశవంతంగా మరియు ఆకర్షణీయంగా కనిపిస్తుంది.పిగ్మెంటేషన్ సమస్య నుంచి విముక్తి కలిగించడానికి కూడా ఈ చిట్కా ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.

Advertisement

తాజా వార్తలు