ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే మచ్చలే కాదు ముడతలు సైతం పరార్!

మచ్చలు, ముడతలు.అత్యధిక శాతం మందిని వేధించే చర్మ సమస్యల్లో ఇవి ముందు వరుసలో ఉంటాయి.

చర్మంపై మచ్చలు, ముడతలు ఏర్పడటం వల్ల అందంతో పాటు ఆత్మవిశ్వాసం సైతం దెబ్బ తింటుంది.ఈ క్రమంలోనే మచ్చలు, ముడతల‌ను తగ్గించుకోవడం కోసం ముప్ప తిప్ప‌లు పడుతుంటారు.

మార్కెట్ లో ల‌భ్యం అయ్యే క్రీమ్‌లు, సీరంలు వాడుతుంటారు.వాటి కోసం వేల‌కు వేలు ఖ‌ర్చు పెడుతుంటారు.

అయితే పైసా ఖ‌ర్చు లేకుండా ఇంట్లోనే ఈ రెండు సమస్యలను ఒకే చిట్కాతో వదిలించుకోవచ్చు.మరి ఇంత‌కీ చిట్కా ఏంటి అనేది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముందుగా ఒక బంగాళ‌దుంపను తీసుకుని నీటిలో శుభ్రంగా కడగాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్‌ వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో కడిగి పెట్టుకున్న బంగాళదుంపను వేసి కనీసం ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత ఉడికించిన బంగాళదుంపకు ఉన్న‌ తొక్క తొలగించి మెత్తగా స్మాష్ చేసుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో స్మాష్ చేసుకున్న బంగాళ‌దుంపను వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం, హాఫ్ టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకోవాలి.మరియు కొద్దిగా బంగాళదుంప ఉడికించిన వాటర్ ను కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని స్మూత్ గా మసాజ్ చేసుకోవాలి.ఆపై ఇర‌వై నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకుని అప్పుడు వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు

ఈ సింపుల్ చిట్కాను రోజుకు ఒకసారి పాటిస్తే మచ్చలే కాదు ముడతలు సైతం పరార్ అవ్వడం ఖాయం.కాబట్టి మచ్చలు ముడతలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ సింపుల్ చిట్కాను పాటించండి.

Advertisement

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

తాజా వార్తలు