తల స్నానానికి ముందు ఈ చిన్న చిట్కాను పాటిస్తే చుండ్రుకు శాశ్వతంగా బై బై చెప్పవచ్చు..?

చుండ్రు( dandruff ) .ఆడ మగ అనే తేడా లేకుండా దాదాపు అందరిని అత్యంత సర్వసాధారణంగా వేధించే సమస్యల్లో ఇది ఒకటి.

చుండ్రు కారణంగా తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు.తలలో విపరీతమైన దురద పుడుతుంటుంది.

ఈ క్రమంలోనే చుండ్రును వదిలించుకోవడం కోసం రకరకాల షాంపూలను వాడుతుంటారు.అయితే ఎన్ని రకాల షాంపూలు మార్చినా కొందరిలో చుండ్రు అనేది పోదు.

అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది.తల స్నానానికి ముందు ఈ చిట్కాను కనుక పాటిస్తే చుండ్రుకు శాశ్వతంగా బై బై చెప్పవచ్చు.

Advertisement

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు( fenugreek ) వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుస‌టి రోజు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో నానబెట్టుకున్న మెంతులను వాటర్ తో సహా వేసుకోవాలి.

అలాగే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు( onion slices ), రెండు టేబుల్ స్పూన్లు భృంగరాజ్ పొడి ( Bhringraj powder )మరియు ఒక కప్పు వాటర్ వేసుకొని దాదాపు ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్టైన‌ర్‌ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut oil ) మరియు హాఫ్ టేబుల్ స్పూన్ రోజ్ మేరీ ఆయిల్ ( Rose Mary Oil )వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఒక మంచి హెయిర్ టోనర్ అనేది సిద్ధం అవుతుంది.ఈ టోనర్ ను స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి ఆపై స్కాల్ప్‌ తో పాటు జుట్టు మొత్తానికి తయారు చేసుకున్న టోన‌ర్ ను ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.

గంట అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి కనీసం ఒక్కసారి ఈ టోనర్ ను కనుక వాడితే చుండ్రు మొత్తం క్రమంగా మాయమవుతుంది.స్కాల్ప్ హెల్తీగా మరియు తేమగా మారుతుంది.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!

చుండ్రు సమస్యను వదిలించడానికి ఈ హోమ్ మేడ్‌ టోనర్ ఉత్తమంగా సహాయపడుతుంది.కాబ‌ట్టి త‌ప్ప‌కుండా ప్ర‌య‌త్నించండి.

Advertisement

తాజా వార్తలు