తల స్నానానికి 2 గంటల ముందు ఈ చిన్న చిట్కా పాటిస్తే మీ జుట్టు ఊడమన్నా ఉండదు.. తెలుసా?

హెయిర్ ఫాల్.( Hair fall ) మనలో చాలా మందిని బాధ పెట్టే కామన్ సమస్య ఇది.

అయితే అందరిలోనూ ఈ సమస్య ఒకేలా ఉండదు.కొందరిలో హెయిర్ ఫాల్ తక్కువగా ఉంటే.కొందరిలో మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది.

ఇలాంటి వారు జుట్టు రాలడాన్ని ఎలా అడ్డుకోవాలో తెలియక తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు.మీరు ఈ లిస్టులో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే చిన్న చిట్కా మీకు చాలా బాగా సహాయపడుతుంది.తల స్నానానికి రెండు గంటల ముందు ఈ చిట్కాను పాటిస్తే మీ జుట్టు ఊడమన్నా ఊడదు.

మరి లేటెందుకు ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి.

Follow This Simple Remedy Before A Head Bath To Stop Hair Fall , Hair Fall,

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం, వన్ టేబుల్ స్పూన్ మెంతులు, ఒక కప్పు కలబంద ముక్కలు, నాలుగు లవంగాలు మరియు అర కప్పు ఎండిన ఆరెంజ్ తొక్కలు వేసుకోవాలి.చివరిగా ఒక గ్లాస్ వాటర్ పోసి బాగా కలిపి మూత పెట్టి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు ఆ గిన్నెను స్టవ్ పై పెట్టి మరో అర గ్లాసు వాటర్ పోసి దాదాపు ప‌దిహేను నిమిషాల వరకు ఉడికించాలి.

Follow This Simple Remedy Before A Head Bath To Stop Hair Fall , Hair Fall,

ఆపై స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్( Olive oil ) వేసి బాగా మిక్స్ చేస్తే మంచి టోనర్ సిద్ధం అవుతుంది.

ఈ టోనర్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండు సార్లు స్ప్రే చేసుకోవాలి.

Follow This Simple Remedy Before A Head Bath To Stop Hair Fall , Hair Fall,

రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే హెయిర్ ఫాల్( Hair fall ) ఎంత తీవ్రంగా ఉన్నా సరే కంట్రోల్ అవుతుంది.కుదుళ్లు బలోపేతం అవుతాయి.

దాంతో జుట్టు రాలడం తగ్గుతుంది.అలాగే ఈ రెమెడీ జుట్టు ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

చుండ్రు సమస్యను సైతం దూరం చేస్తుంది.

తాజా వార్తలు