Acne : ఈ సింపుల్ చిట్కాను పాటించారంటే మీ ముఖంపై ఒక్క మొటిమ కూడా ఉండదు!

టీనేజ్ ప్రారంభమైందంటే చాలు యువతీ యువకులను మొటిమల సమస్య( Acne ) ప్రధానంగా వేధిస్తుంటుంది.కొందరికి ముఖంపై గ్యాప్‌ లేకుండా మొటిమలు వస్తూనే ఉంటాయి.

ఇలాంటి వారు మానసికంగా ఎంతో ఒత్తిడికి గురవుతుంటారు.మొటిమల సమస్య నుంచి బయటపడేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కా మీకు ఎంతో చ‌క్క‌గా సహాయపడుతుంది.ఈ సింపుల్ చిట్కాను పాటించారంటే మీ ముఖంపై ఒక్క‌ మొటిమ కూడా ఉండదు.

అందుకు ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ప‌ది ఫ్రెష్ పుదీనా( Spearmint ) ఆకులు వేసుకోవాలి.అలాగే రెండు రెబ్బలు వేపాకు మరియు రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఈ జ్యూస్ లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి ఒకటికి రెండుసార్లు పట్టించి 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని శుభ్రంగా వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే మొటిమలన్నీ ప‌రార్ అవుతాయి.

మొటిమల తాలూకు మచ్చలు సైతం మాయం అవుతాయి.క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

అలాగే త‌ర‌చూ ఈ రెమెడీని పాటించడం వల్ల మొటిమల సమస్యకు దూరంగా ఉండవచ్చు.చర్మాన్ని అందంగా మెరిపించుకోవచ్చు.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..

ఇక రెమెడీని ఫాలో అవ్వడంతో పాటు జంక్ ఫుడ్( Junk food ) కు దూరంగా ఉండండి.చక్కెర, చక్కెరతో తయారు చేసిన స్వీట్లను అవాయిడ్‌ చేయండి.

Advertisement

శరీరానికి అవసరమయ్యే వాటర్ ను అందించండి.నిత్యం అర‌గంట‌ వ్యాయామం చేయండి.

మరియు కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోండి.తద్వారా మీ చర్మం ఎక్కువ కాలం పాటు య‌వ్వ‌నంగా, అందంగా ఉంటుంది.

తాజా వార్తలు