కృత్రిమ రంగులు అక్కర్లేదు.. ఈ రెమెడీని పాటిస్తే తెల్ల జుట్టు సహజంగానే నల్లగా మారుతుంది!

వైట్ హెయిర్.చాలా మందిని కలవరపెట్టే సమస్య ఇది.ఇర‌వై ఏళ్ల తర్వాత జుట్టు తెల్లగా మారిన అధిక శాతం మంది పెద్దగా పట్టించుకోరు.

కానీ ముప్పై, న‌ల‌భై ఏళ్ల వయసులోనే జుట్టు తెల్లగా మారుతోందంటే.

ఇక వారి బాధ వర్ణనాతీతం.జుట్టు తెల్లగా మారడం వల్ల అందం తగ్గిపోతుందని, వయసు పైబడిన వారిలా కనిపిస్తారని భావిస్తుంటారు.అలాగే ఇరుగు పొరుగు వారు ఎక్కడ హేళ‌న‌ చేస్తారో అని ఆందోళన చెందుతుంటారు.

ఈ క్రమంలోనే తెల్ల జుట్టును కవర్ చేసుకునేందుకు కృత్రిమ రంగులపై ఆధారపడుతుంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని పాటిస్తే కృత్రిమ రంగులు అక్కర్లేదు.

సహజంగానే తెల్లగా మారిన జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా కడాయి పెట్టుకుని అందులో ఒక కప్పు ఎండిన ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలి.అలాగే ఒక కప్పు శీకాకాయ, మూడు టేబుల్ స్పూన్లు ఆవాలు వేసి నల్లగా మారేంత వరకు వేయించుకోవాలి.

ఇలా వేయించుకున్న వాటిని మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్‌ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు గ్రైండ్ చేసుకున్న పొడి వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసుకుని బాగా మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బ్రష్ సహాయంతో అప్లై చేసుకుని ష‌వ‌ర్ క్యాప్ ధరించాలి.

రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే తెల్ల జుట్టు సహజంగానే నల్లగా మారుతుంది.కాబట్టి వైట్ హెయిర్ సమస్యతో ఎవరైతే సతమతం అవుతున్నారో వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించేందుకు ప్రయత్నించండి.

పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!
Advertisement

తాజా వార్తలు