మోచేతులు, మోకాళ్లు తెల్లగా మెరిసిపోవాలా.. అయితే ఇలా చేయండి!

సాధారణంగా కొందరికి బాడీ మొత్తం ఒక రంగులో ఉంటే మోచేతులు( Elbows ) మరియు మోకాళ్లు( Knees ) మాత్రం నల్లగా వేరుపాటుగా ఉంటాయి.

మోచేతులు మోకాళ్లు డార్క్ గా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి.

ప్రధానంగా డెడ్ స్కిన్ సెల్స్‌ పేరుకుపోవడం, హార్మోన్ చేంజ్, విటమిన్ల లోపం, పలు రకాల మందుల వాడకం, హైపర్ పిగ్మెంటేషన్ తదితర కారణాల వల్ల మోచేతులు మరియు మోకాళ్లు నల్లగా మారుతుంటాయి.ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక తెగ వర్రీ అయిపోతూ ఉంటారు.

డార్క్ గా ఉన్న మోచేతులు, మోకాళ్ల‌ను క‌వ‌ర్ చేసుకునేందుకు నానా తంటాలు ప‌డుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని తప్పకుండా ప్రయత్నించండి.ఈ రెమెడీ మీ మోచేతులు మరియు మోకాళ్లను తెల్లగా మెరిపించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు( Organic Turmeric ) వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి.

Advertisement

ఇప్పుడు ఈ పసుపులో వన్ టీ స్పూన్ కాఫీ పౌడర్,( Coffee Powder ) వన్ టీ స్పూన్ బియ్యం పిండి,( Rice Flour ) వన్ టీ స్పూన్ తేనె మరియు సరిపడా పచ్చి పాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మోచేతులకు మరియు మోకాళ్లకు అప్లై చేసుకుని దాదాపు ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

మూడు రోజులకు ఒకసారి ఈ సింపుల్ హోమ్ రెమెడీని కనుక పాటించారంటే అదిరిపోయే రిజల్ట్ మీ సొంతం అవుతుంది.ఈ రెమెడీ చర్మం పై పేరుకుపోయిన మురికి మృత కణాలను తొలగిస్తుంది.హైపర్ పిగ్మెంటేషన్ ను( Hyper Pigmentation ) తగ్గిస్తుంది.

మీ మోచేతులు మరియు మోకాళ్లను తెల్లగా కాంతివంతంగా మెరిపిస్తుంది.మరియు మృదువుగా సైతం మారుస్తుంది.

టమాటాలు ఇలా తింటే రిస్క్‌లో ప‌డిన‌ట్టే!!
Advertisement

తాజా వార్తలు