వారానికి ఒక్కసారి ఇలా చేశారంటే వర్షాకాలంలోనూ మీ పాదాలు తెల్లగా మృదువుగా మెరిసిపోతాయి!

ప్రస్తుత వర్షాకాలంలో ( rainy season )పాదాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరికి ఎంతో కష్టతరంగా మారుతుంటుంది.

వర్షపు నీటిలో తరచూ నానడం వల్ల పాదాలు చాలా పాడవుతుంటాయి.

పాదాలు జెర్మ్స్ మరియు ఇన్ఫెక్షన్లకు గురవుతాయి.మురికి, మృత కణాలు పేరుకుపోయి పాదాలు పొడిగా నిర్జీవంగా తయారవుతుంటాయి.

అలాగే నీటికి నిరంతరం బహిర్గతం చేయడం, తడి బూట్లు ధ‌రించడం మ‌రియు స్థిరమైన తేమ వల్ల పాదాల నుంచి దుర్వాస‌న కూడా వ‌స్తుంటుంది.

అయితే అటువంటి పాదాలను రిపేర్ చేయడానికి ఒక అద్భుతమైన హోమ్ రెమెడీ ఉంది.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే వర్షాకాలంలోనూ మీ పాదాలు తెల్లగా, మృదువుగా మెరిసిపోతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee powder ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా( Baking soda ), వన్ టేబుల్ స్పూన్ రెగ్యుల‌ర్ షాంపూ, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ ( Coconut oil )మరియు రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ వేసుకుని స్పూన్ స‌హాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా త‌యారు చేసుకున్న‌ మిశ్రమాన్ని పాదాలకు పట్టించి చేతి వేళ్ళతో ఐదు నిమిషాల పాటు బాగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.ఆపై అర నిమ్మ చెక్కను తీసుకుని పాదాలను మరో ఐదు నిమిషాల పాటు రుద్దాలి.చివరిగా గోరు వెచ్చని నీటితో శుభ్రంగా పాదాలను క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి.

ఒక‌వేళ మాయిశ్చ‌రైజ‌ర్ లేక‌పోతే చ‌క్క‌గా కొబ్బ‌రి నూనె లేదా ఆవ నూనె తీసుకుని పాదాల‌ను అప్లై చేసుకుని మ‌సాజ్ చేసుకోండి.వారానికి ఒకసారి ఈ విధంగా కనుక చేశారంటే అందమైన మెరిసే పాదాలు మీ సొంతం అవుతాయి.

అలాగే ఈ రెమెడీ పాదాలపై పేరుకుపోయిన డస్ట్ అండ్ డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది.పొడిగా నిర్జీవంగా మారిన పాదాలను రిపేర్ చేస్తుంది.పాదాల నుంచి దుర్వాస‌న రాకుండా అడ్డుకుంటుంది.

ప్యారిస్ ఒలింపిక్స్ లో ముగిసిన భారత్ పతకాల వేట..
ధనలక్ష్మి కటాక్షం కలగాలంటే పూజలో ఈ వస్తువులు తప్పనిసరి!

మ‌రియు మీ పాదాల‌ను తెల్లగా మృదువుగా మెరిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు